శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన “కుబేరా” సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్బ్ టాక్‌తో దూసుకుపోతోంది. ధనుష్ లీడ్‌గా నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సినిమా విజయాన్ని పక్కన పెడితే… నాగార్జున అభిమానుల్లో మాత్రం అసంతృప్తి కనిపిస్తోంది. అది మనకు సోషల్ మీడియా పోస్ట్ లలో కనిపిస్తోంది.

ధనుష్ సినిమా… నాగార్జున పాత్ర ప్రత్యేకమే కానీ

సినిమా మొదటి నుంచి ఇది ధనుష్ ప్రధాన పాత్రలోనూ, నాగార్జున ఓ పాత్‌బ్రేకింగ్ క్యారెక్టర్‌లోనూ వస్తున్న సినిమా అని చెప్పినప్పటికీ… ఫ్యాన్స్ లోపల ఓ ఆశ ఉండేది. నాగ్ లాంటి స్టార్ కు ఖచ్చితంగా స్పెషల్ మాస్ మోమెంట్స్ ఉంటాయనే గట్టి నమ్మకం. కానీ సినిమా చూసిన తర్వాత… “అది అంతగా అనిపించలేదు” అంటున్నారు అక్కినేని అభిమానులు.

రోల్‌కి లేయర్లు ఉన్నా… స్టార్‌కు సరిపోవడం లేదంటున్నారు!

నాగార్జున పాత్రలో భావోద్వేగాలున్నాయి, మెచ్యూరిటీ ఉంది, విలక్షణత ఉంది — నటన పరంగా ఆయన పరిపూర్ణంగా ఒదిగిపోయారు. అయితే… ఒక స్టార్ హీరోగా మెరుస్తూ, థియేటర్లను ఊపే హైపోయింట్లు లేకపోవడమే ఫ్యాన్స్‌కి పెద్ద మైనస్‌ అయింది.

“నాగ్ కి ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ స్పేస్ బాగుంది కానీ… రెండో భాగంలో పూర్తిగా బ్యాక్‌ఫుట్‌కి వెళ్లిపోయారు. అంతకు మించి, ఆయన పాత్రకు ఒక్క హై ఓల్టేజ్ సీన్ లేకపోవడమే అసంతృప్తికి కారణం” అంటున్నారు hardcore ఫ్యాన్స్.

కమ్ముల చూపు క్లాస్ ప్రేక్షకులపై… ఫ్యాన్స్ మాత్రం మాస్‌ను కోరుకుంటారు!

శేఖర్ కమ్ముల తన సినిమాల్లో రియలిజం, ఎమోషన్ల మీదే దృష్టి పెడతారు. ఈ పాత్ర కూడా ఆయన స్టైల్‌కి సరిపోయేలా ఉంది. కానీ అభిమానులు కోరేది మరోరకమైన “హీరోయిజం”. సినిమాకొచ్చే ప్రేక్షకుడికి బాగానే అనిపించవచ్చు. కానీ దశాబ్దాల నుంచి నాగార్జునను స్టార్ గా చూసిన ఫ్యాన్స్‌కు… “ఇది చాలదు” అనే భావన స్పష్టంగా ఉంది.

నటుడిగా నాగార్జున అద్భుతం… కానీ స్టార్‌గా మిస్‌ఫైర్!

క్లాస్ ఆడియన్స్ మెచ్చే విధంగా డిజైన్ చేసినప్పటికీ, మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో పాత్రకి ఫ్యాన్స్ కోరుకునే రేంజ్‌లో హై పాయింట్లు లేకపోవడం వల్లే ఈ అసంతృప్తి. “నటుడిగా గౌరవించాం… కానీ హీరోగా యాక్షన్ మిస్ అయ్యింది” అనేది అక్కినేని అభిమానుల కామన్ ఫీలింగ్. కంప్లైంట్

, , , ,
You may also like
Latest Posts from