చిరంజీవి సినిమా అంటే ఒక్క చిన్న అప్డేట్‌ వచ్చినా వైరల్ అవుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తాజాగా మెగాస్టార్‌ నటిస్తున్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే… చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో దీపికా పదుకోని ని తీసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ వార్తపై అసలైన క్లారిటీ వచ్చింది.

దీపికా పదుకోన్ – చిరంజీవి కాంబో న్యూస్‌

ఇప్పటికే “దసరా”తో హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెలకు, చిరంజీవి సినిమా అవకాశం రావడమే ఓ పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి దీపికా పదుకోని పేరు తెరపైకి రావడంతో మెగా ఫ్యాన్స్‌ ఆశలు పెంచుకున్నారు.

కానీ ఇది పూర్తిగా నిజం కాదని, చిత్ర టీమ్ లోని ఒక సభ్యుడు స్పష్టత ఇచ్చాడు. “ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదు. దీపికా పదుకోని ఈ ప్రాజెక్టులో లేరు” అని తెగేసి చెప్పేశాడు.

మొత్తానికి, దీపికా పదుకోన్ మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేయబోతుందనే వార్తలు కేవలం గాసిప్ మాత్రమే అన్నది ఈ అప్డేట్‌తో తేలిపోయింది.

“విశ్వంభర”పై కూడా క్లారిటీ రావాల్సిందే

ఇదిలా ఉంటే, చిరంజీవి నటిస్తున్న మరో భారీ చిత్రం విశ్వంభర కూడా విడుదల తేదీ ఖరారు చేసుకోలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించిన VFX వర్క్ భారీ స్థాయిలో జరుగుతుండటంతో డేట్‌ ఫిక్స్ చేయడం కష్టమవుతోంది.

, ,
You may also like
Latest Posts from