సినిమా వార్తలు

అల్లు అర్జున్ సినిమా తర్వాత దీపికా స్కెచ్ మామూలుగా లేదుగా.. అంతర్జాతీయ సిరీస్‌లో ఛాన్స్!

ముంబై: పెళ్లై, తల్లి అయిన తర్వాత కూడా దీపికా పదుకొణె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో ‘కింగ్’ సినిమాతో పాటు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీలోనూ దీపికానే హీరోయిన్. అయితే, ఇప్పుడు ఆమె మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రపంచ ప్రసిద్ధ సిరీస్‌లో దీపికా ఎంట్రీ!

తాజా సమాచారం ప్రకారం, దీపికా పదుకొణె త్వరలోనే ఒక గ్లోబల్ వెబ్ సిరీస్‌తో డిజిటల్ దునియాలోకి అడుగుపెట్టబోతోంది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ ఉన్న ‘ది వైట్ లోటస్’ (The White Lotus) నాలుగో సీజన్‌లో దీపికా కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ సిరీస్, ఇప్పుడు నాల్గవ సీజన్ కోసం దీపికాను సంప్రదించిందట.

ఒక్కో ప్రాజెక్టుకు రూ. 20 కోట్లు!

ఇప్పటికే హాలీవుడ్ మూవీ ‘xXx: రిటర్న్ ఆఫ్ జెండర్ కేజ్’లో నటించి గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన దీపికా, ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరు. ఆమె ఒక్కో ప్రాజెక్టుకు దాదాపు రూ. 20 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఇప్పుడు రాబోయే ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె భారీ ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు సమాచారం.

అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు?

ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, దీపికా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనిపై యశ్ రాజ్ ఫిల్మ్స్ లేదా మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వెండితెరపైనే కాకుండా, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై కూడా దీపికా తన సత్తా చాటడానికి రెడీ అయిపోయింది.

Similar Posts