బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన, ప్రముఖ తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘జాట్’ . ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కోసం రెడీ అయ్యింది. ఈ వేసవిలో థియేటర్లలో మంచి స్పందన పొందిన ‘జాట్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమంటే, ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు లో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ను సొంత ఇంటి సౌకర్యంలో ఆస్వాదించవచ్చు.
కథేంటి
‘జాట్’ కథ ప్రధానంగా మోటుపల్లి గ్రామం చుట్టూ నడుస్తుంది. అక్కడ రణతుంగ (రణదీప్ హుడా) మరియు అతని తమ్ముడు సోములు (వినీత్ కుమార్‌సింగ్) తమ భయంకర ప్రవర్తనతో గ్రామంలో వారివల్లే ప్రజలు భయపడతారు. ఏది వచ్చినా వారు దక్కించుకోవాలని అలవాటు. ఒకప్పుడు ప్రయాణంలో ఉన్న జాట్ (సన్నీ డియోల్) రైలు అవాంతరం వల్ల ఆ గ్రామం దగ్గర ఆగిపోతాడు. రైలు మరమ్మత్తులకు సమయం పడుతుందని తెలుసుకుని, జాట్ ఒక హోటల్‌కు టిఫిన్ కోసం వెళ్తాడు.
అక్కడ కొందరు రౌడీలు గొడవ పెట్టడంతో జాట్ చింతగా మారిపోతాడు. జాట్ తిన్న ప్లేట్ నేలపై పడేస్తే, అక్కడే చర్చా ఘర్షణ మొదలవుతుంది. ఈ చిన్న సంఘటన ఊర్లోని రణతుంగ దాకా చేరడంతో కథలో ఉత్కంఠ పెరుగుతుంది. ఈ ఘర్షణలో జాట్ ఏ నిజాలను తెలుసుకుంటాడు? రణతుంగతో అతని సంబంధం ఏంటి? ఆ క్రూర రణతుంగను ఎదుర్కొనేందుకు జాట్ ఎలా సిద్ధమవుతాడో ఇదే కథా మసాలా.
యాక్షన్ ప్రేమికులకు ఇది మంచి treat అని చిత్ర టీమ్ చెబుతోంది. థియేటర్లలో పొందిన విజయాన్ని ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫాం మీద కూడా ‘జాట్’ మరింత అభిమానులను సొంతం చేసుకుునే అవకాసం ఉంది.