సినిమా వార్తలు

దీపికా పదుకొనె క్రేజీ హాలీవుడ్ ఆఫర్! తల్లి అయ్యాక ‘గ్లోబల్’ రేంజ్ స్కెచ్.. టాప్ సిరీస్‌లో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ!

బాలీవుడ్ ‘మస్తానీ’ దీపికా పదుకొనె సెకండ్ ఇన్నింగ్స్ మామూలుగా లేదు. ప్రెగ్నెన్సీ బ్రేక్ తర్వాత వరుసగా భారీ ప్రాజెక్టులతో ఈ గ్లోబల్ స్టార్ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద షారుఖ్ ఖాన్ (కింగ్), అల్లు అర్జున్ (AA22) సినిమాలతో బిజీగా ఉన్న దీపిక.. ఇప్పుడు మరోసారి హాలీవుడ్ వెండితెరను ఏలడానికి సిద్ధమైంది.

మిస్సయిన మూడో సీజన్.. దక్కిన నాలుగో సీజన్!

హాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ అండ్ క్రిటికల్లీ అక్లెయిమ్డ్ సిరీస్ ‘ది వైట్ లోటస్’ (The White Lotus) లో దీపిక కీలక పాత్ర పోషించబోతోంది. నిజానికి ఈ సిరీస్ మూడో సీజన్ కోసమే దీపికను అనుకున్నారు. కానీ ఆ సమయంలో ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

అయితే, దీపికా క్రేజ్ దృష్ట్యా మేకర్స్ ఆమెను వదల్లేదు. తాజాగా ‘ది వైట్ లోటస్’ సీజన్ 4 కోసం దీపికా పదుకొనె అగ్రిమెంట్ పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లోనే ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో జెన్నిఫర్ కూలిడ్జ్, అలెగ్జాండ్రా దడ్డారియో వంటి హాలీవుడ్ స్టార్లతో కలిసి దీపికా సందడి చేయనుంది.

హాలీవుడ్ టార్గెట్.. లోకల్ పక్కా!

ఒకపక్క గ్లోబల్ సిరీస్‌లు చేస్తూనే, మరోపక్క టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తూ సౌత్ మార్కెట్‌ను కూడా దీపికా టార్గెట్ చేస్తోంది. త్వరలోనే ఈ హాలీవుడ్ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తల్లి అయ్యాక తన కెరీర్‌ను మరింత వేగంగా, ప్లాన్డ్‌గా నడిపిస్తున్న దీపికా జోరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Similar Posts