పెద్ద సినిమాలకు లీక్ లు బాధలు తప్పటం లేదు. షూటింగ్ లొకేషన్స్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇవి జరుగుతూనే ఉన్నాయి. కొందరు అత్యుత్సాహంతో చేసే ఈ పనిలో టీమ్ మొత్తాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‍లో తెరకెక్కుతున్న మూవీ (ఎస్ఎస్ఎంబీ29) చిత్రం వీడియో ఇప్పుడు లీకై వైరల్ అవుతోంది.

ఈ కాంబినేషన్ పై నేషనల్ లెవిల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. గ్లోబల్ రేంజ్‍లో గ్రాండ్ స్కేల్‍లో ఈ అడ్వెంచర్ యాక్షన్ మూవీ రూపొందుతోంది. ఇటీవలే హైదరాబాద్‍లో కాస్త షూటింగ్ జరగగా.. ప్రస్తుతం ఒడిశాలో సాగుతోంది.

ఈ మూవీకి మరోసారి లీక్ బెదడ తగిలింది. ఇటీవలే ఒడిశా షూటింగ్ సెట్‍కు సంబంధించి ఓ వీడియో బయటికి వచ్చింది. అయితే, ఇప్పుడు ఏకంగా షూటింగ్ వీడియోనే లీకైంది.

లీక్డ్ వీడియోలో ఏముంది

ఎస్ఎస్ఎంబీ29 (వర్కింగ్ టైటిల్) ఒడిశా షూటింగ్ స్పాట్ నుంచి వీడియో క్లిప్ లీకైంది. మహేశ్ బాబు అలా నడిచి వస్తుంటే.. గన్ పట్టుకున్న ఓ సెక్యూరిటీ పర్సన్ వెనక నుంచి తోస్తాడు.

ఆ తర్వాత వీల్‍చైర్‌లో కూర్చున్న వ్యక్తి ముందు మహేశ్ మోకాళ్లపై కూర్చుంటారు. ఇలా ఈ లీక్డ్ వీడియోలో ఉంది. ఇది ఓ యాక్షన్ సీన్‍లా కనిపిస్తోంది. ఈ సీన్‍ను కారులో నుంచి మొబైల్‍తో రికార్డు చేసినట్టుగా అనిపిస్తోంది.

, , ,
You may also like
Latest Posts from