సినిమా వార్తలు

1300 కోట్ల ‘ధురంధర్’.. ఇక ఓటీటీలో! ఎందులో.. ఎప్పుడంటే?

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ ఏకంగా 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇప్పుడు ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఓటీటీలో చూసేందుకు మూవీ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌తో భారీ డీల్..

ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) రికార్డు స్థాయిలో దాదాపు 130 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ కావడం విశేషం. థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ చేయాలనే అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు రిలీజ్ డేట్ ఖరారైంది.

స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

తాజా సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని జనవరి 31, 2026 నుండి స్ట్రీమింగ్ చేయబోతోంది. థియేటర్లలో ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, సరిగ్గా 50 రోజుల తర్వాత డిజిటల్ తెరపై సందడి చేయనుంది.

బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ సృష్టించిన ప్రభంజనం:

బడ్జెట్: 280 కోట్లు

వసూళ్లు: ఇండియాలో 993 కోట్లు (గ్రాస్), ఓవర్సీస్‌లో 293 కోట్లు.. వెరసి మొత్తం 1300 కోట్లు!

థియేటర్లు: ప్రపంచవ్యాప్తంగా 4000 స్క్రీన్లలో విడుదల.

నటీనటులు: రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్ వంటి భారీ తారాగణం నటించారు.

థియేటర్లలో బాంబ్ బ్లాస్ట్ యాక్షన్ సీక్వెన్స్‌లతో అలరించిన ‘ధురంధర్’.. ఇక ఇంట్లోనే హోమ్ థియేటర్లలో సందడి చేయనుంది. స్పై థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ వీకెండ్ ట్రీట్ అనడంలో సందేహం లేదు.

Similar Posts