అఖిల్ అక్కినేని ముంబయికి చెందిన బిలియనీర్ ఫ్యామిలీకి అల్లుడయ్యాడు. శుక్రవారం ఉదయం అఖిల్ – జైనబ్ రవ్‌డ్జీ వివాహం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిందన్న సంగతి తెలిసిందే. ఈ వివాహాన్ని అక్కినేని కుటుంబం పూర్తిగా ప్రైవేట్‌గా నిర్వహించినా… పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న విషయం మరొకటి – జైనబ్‌ రవ్‌డ్జీ ఆస్తుల విలువ!

జైనబ్ ఫ్యామిలీ – బిలియనీర్ బిజినెస్ లెగసీ!

జైనబ్‌ రవ్‌డ్జీ… ముంబయికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె.
జుల్ఫీ రవ్‌డ్జీ — రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్‌, పవర్ ప్రాజెక్టులలో దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు నడుపుతున్న బడా ఇండస్ట్రియలిస్ట్.
వీరి కుటుంబానికి:

భారతవ్యాప్తంగా అనేక పవర్ ప్లాంట్లు

కన్‌స్ట్రక్షన్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు

మరియు భారీ స్థాయిలో బిజినెస్ వాటాలు ఉన్నాయి.

జైన్ రవ్‌డ్జీ – పవర్ ఎనర్జీ కంపెనీ CEO

జైనబ్ సోదరుడు జైన్ రవ్‌డ్జీ “ZR Renewable Energy Pvt. Ltd.” అనే పవర్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఇది పలు రాష్ట్రాల్లో రిన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్లను అమలు చేస్తోంది. ఇలా చూస్తే ఈ ఫ్యామిలీ ఎనర్జీ రంగం నుంచి రియల్ ఎస్టేట్ దాకా విస్తరించి ఉన్నట్లు స్పష్టమవుతోంది.

మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం – రవ్‌డ్జీ ఫ్యామిలీకి కనీసం ₹8,000 నుంచి ₹10,000 కోట్ల వరకు ఆస్తులుండొచ్చని టాక్ వినిపిస్తోంది. వీరి కంపెనీలు unlisted అయినా, గ్లోబల్ లెవెల్‌ బిజినెస్ డీల్స్‌లో ఉన్నాయి.

, , , ,
You may also like
Latest Posts from