దశాబ్దాల తర్వాత ఓ తిరిగొచ్చిన ఇద్దరు దిగ్గజాలు – మణిరత్నం, కమల్ హాసన్. ‘నాయగన్’ తర్వాత మరో సారిగా స్క్రీన్‌పై వీరిద్దరి కలయికను చూడబోతున్నామని తెలిసినప్పటి నుంచి, ‘థగ్ లైఫ్’ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను ‘విక్రమ్’ తర్వాతి మాస్ బ్లాక్‌బస్టర్గా ఊహించుకున్నారు. కానీ రిలీజైన తొలి రోజే… ఆ ఆశలు అక్షరాలా బూడిద అయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో ‘థగ్ లైఫ్’కి షాక్ ట్రీట్‌మెంట్!

తమిళనాడులో మొదటి షోకే హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి. కానీ ఆంధ్ర, తెలంగాణలో మాత్రం థియేటర్లలో జనమే కరువు అయ్యారు. ఫస్ట్ డే ఓపినింగ్స్ ఫరవాలేదనిపించే ఆక్యుపెన్సీ కనిపించినా, ఓవర్సీస్ రిపోర్ట్స్, మార్నింగ్ షో వర్డ్ ఆఫ్ మౌత్ కిందికి పడిపోయిన హైప్ మొత్తం ముంచేసింది. ఈవెనింగ్, నైట్ షోలు క్యాన్సిల్ అయ్యే స్థాయికి వచ్చింది. B, C సెంటర్లలో థియేటర్లు ఖాళీగా నిలిచిపోయాయి. చాలా చోట్ల షోలు కాన్సిల్ చేసారు. కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలు ఇంతకు మించిన అవమానం ఏముంటుంది.

‘థగ్ లైఫ్’ను కమల్ హాసన్ తన Raaj Kamal Films International బ్యానర్‌పై అడ్వాన్స్ బేసిస్‌లో తెలుగు మార్కెట్‌లో రిలీజ్ చేశారు. కానీ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ దారుణంగా ఉండటంతో, ఇప్పుడు తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద మొత్తం రీఫండ్ చేయాల్సిన పరిస్థితి కమల్‌కి ఎదురవుతోంది.

ఓ స్టార్ హీరోకి తన సినిమా షోలు క్యాన్సిల్ కావడం, డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన దశకి రావడం… ఇది కేవలం బిజినెస్ ఫెయిల్యూర్ మాత్రమే కాదు — ఒక హీరో క్రేజ్ కు తగిలిన పెద్ద దెబ్బ! ఇది కేవలం ఓ సినిమా ఫ్లాప్ కాదు. ఇది కమల్ హాసన్ కెరీర్‌లోనే అత్యంత అవమానకరమైన ఓపెనింగ్!

, , , ,
You may also like
Latest Posts from ChalanaChitram.com