నస్లెన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా, దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త లోక: చాప్టర్ 1 – చంద్ర’!. ఈ ఫీమేల్ సూపర్‌హీరో ఎంటర్‌టైనర్ ఆగస్టు 29న పెద్దగా అంచనాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు సాంకేతిక కారణాలతో రిలీజ్ డిలే అయినా… ఈవెనింగ్ షోల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో రెండో రోజు నుంచే స్క్రీన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగి, కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి షాకిచ్చింది.

కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా ‘కొత్త లోక’ కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. రెండో వీకెండ్ కూడా రాబోయే సినిమాల మధ్య బాగానే క్యాష్ చేసుకునే అవకాశముంది. ముఖ్యంగా, మొదటి వారానికే బయ్యర్స్ అంతా లాభాల్లోకి వెళ్లిపోవడం చాలా రేర్ కేస్, కానీ ఈ సినిమా ఆ ఫీట్ సాధించింది.

థియేటర్లలో ఇంత బలంగా నిలబడ్డ ఈ చిత్రం… ఓటిటి ఎంట్రీ ఎప్పుడు ఇస్తుంది? అదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. కానీ దుల్కర్ క్లారిటీ ఇచ్చేశారు – “ఇంకా హడావుడీ లేదు, థియేట్రికల్ రన్ పూర్తయ్యే వరకు ఓటిటికి రాదు” అని.

ఇప్పటికే మోహన్‌లాల్ ‘హృదయపూర్వం’, ఫహద్ ఫాసిల్ Odum Kuthira Chaadum Kuthira వంటి ఓనమ్ రిలీజ్‌లు ఈ వారం డిజిటల్ లోకి వస్తున్నాయి. దాంతో ‘లోక’ కూడా త్వరలో వస్తుందేమో అనుకున్న అభిమానులకు షాక్ ఇచ్చారు.

25 రోజులు పూర్తి చేసుకున్నా, ఈ సినిమా థియేటర్లలోనే రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. కేరళలో 25వ రోజు 3 కోట్లకు పైగా వసూలు చేసింది. ఓపెనింగ్ డే కంటే ఎక్కువ రాబట్టడం ఏ స్థాయిలో రన్ అవుతోందో చెప్పేస్తోంది.

దీంతో ‘లోక’ టీమ్ కి ఇప్పుడు ఒక ఎడ్జ్ వచ్చింది – ఓటిటి డీల్స్ ను తమ షరతుల మీదే ఫైనల్ చేసుకునే లగ్జరీ!

బాక్సాఫీస్ దగ్గర ఇంత స్ట్రాంగ్‌గా నడుస్తున్న లోక… మరి ఓటిటిలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుంది? అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ ప్రశ్న!

, , , ,
You may also like
Latest Posts from