సినిమా వార్తలు

దురంధర్ 1000 కోట్ల రికార్డు.. కానీ తెలుగులో మాత్రం?!

బాక్సాఫీస్ వద్ద ‘దురంధర్ ది రివెంజ్’ సృష్టిస్తున్న అరాచకం మామూలుగా లేదు. కేవలం ఎనిమిది రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్బులో చేరి, ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పింది. రణ్వీర్ సింగ్ నటన, గ్యాంగ్‌స్టర్ డ్రామా చూసి జనం పిచ్చెక్కిపోతున్నారు. కానీ, దేశమంతా ఊగిపోతున్నా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సీన్ కొంచెం తేడాగా ఉందనే టాక్ వినిపిస్తోంది. వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా, తెలుగు డబ్బింగ్ విషయంలో చేసిన ఒక చిన్న తప్పు వల్ల భారీగా నష్టపోయిందా? అసలు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు ఎందుకు తగ్గాయి?

రెండ్రోజుల లేట్.. భారీగా వెయిట్!

దురంధర్ తెలుగు వెర్షన్ రిలీజ్ కావడంలో రెండు రోజులు ఆలస్యం కావడం సినిమా కొంపముంచింది. అప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ఆడియన్స్‌కు డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి రావడంతో థియేటర్ల వద్ద గందరగోళం నెలకొంది. ఓపిక నశించిన తెలుగు ప్రేక్షకులు హిందీ వెర్షనే చూసేయడంతో, ఇక్కడ డబ్బింగ్ వెర్షన్ కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం పడింది. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల తెలుగు బయ్యర్లకు రావాల్సిన లాభాల్లో గండి పడిందనేది వాస్తవం.

పుష్ప 2 రికార్డులకు ఎసరు పెడుతుందా?

ప్రస్తుతం తెలుగులో పాతిక కోట్ల నెట్ వసూళ్లతో స్టడీగా ఉన్న ఈ సినిమా, వీకెండ్‌లో పుంజుకుంటుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, ఫాంటసీ లాంటి హంగామా ఏమీ లేకుండా, కేవలం రా అండ్ రస్టిక్ మాఫియా కథతో ఈ రేంజ్ వసూళ్లు రావడం చిన్న విషయం కాదు. ఇప్పుడు అందరి కళ్ళూ ఒకటే విషయం మీద ఉన్నాయి.. దురంధర్ ది రివెంజ్ బాక్సాఫీస్ దగ్గర ‘పుష్ప 2’ రికార్డులను బ్రేక్ చేస్తుందా? మేకర్స్ మాత్రం ఈ సినిమా రెండు వేల కోట్లు దాటడం ఖాయమని ధీమాగా ఉన్నారు.

కాంతారలా చేసి ఉంటే లెక్క వేరే ఉండేది!

ఒక బాలీవుడ్ సినిమాకు, అది కూడా మొదటి భాగం తెలుగులో రాకుండానే ఇంత అటెన్షన్ రావడం మామూలు విషయం కాదు. అయితే, ‘కాంతార’ సినిమా లాగా అన్ని భాషల్లో ఒకేసారి పక్కాగా రిలీజ్ చేసి ఉంటే తెలుగులో వసూళ్లు డబుల్ అయ్యేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి ఏ సెంటర్లలో ఈ సినిమా ర్యాంపేజ్ మామూలుగా లేదు. ఇతర కొత్త సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడటం రణ్వీర్ సింగ్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

మొత్తానికి ప్లానింగ్‌లో లోపాలు ఉన్నా, దురంధర్ రివెంజ్ మాత్రం ఆగడం లేదు. తెలుగు ఆడియన్స్ నిరీక్షణ మొదటి శనివారం ఫలించింది, ఇక ముందు ముందు ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఎన్ని మైలురాళ్లను దాటుతుందో చూడాలి.

Similar Posts