సినిమా వార్తలు

హన్సిక విడాకులలో బిగ్ ట్విస్ట్ : భరణం ఎంత అడింగిందంటే…!

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని తన గ్లామర్‌తో ఊపేసిన హన్సిక మోత్వానీ, ఇప్పుడు తన విడాకుల వార్తతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భర్త సోహైల్ కతూరియాతో ఈమె విడిపోవడమే ఒక ఎత్తైతే, ఆ ప్రాసెస్ లో ఆమె ఆశించిన భరణం గురించి జరుగుతున్న చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా స్టార్ హీరోయిన్ల విడాకులు అంటే కోట్లలో భరణం, ఆస్తుల వాటాలు ఉంటాయి, కానీ హన్సిక రూటే సెపరేటుగా కనిపిస్తోంది.

కోట్ల ఆస్తి ఉన్నా.. నయా పైసా అడగలేదా?

2022 డిసెంబర్ 4న జైపూర్‌లోని ముండోటా కోటలో అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి, కేవలం రెండేళ్లకే కోర్టు గడప తొక్కింది. అయితే ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది. సాధారణంగా విడాకుల టైమ్ లో భార్యకు భర్త ఆస్తిలో వాటా లేదా భారీ భరణం ఇవ్వడం ఆనవాయితీ. కానీ హన్సిక దాఖలు చేసిన కోర్టు పత్రాల ప్రకారం, ఆమె తన భర్త నుండి ఎటువంటి భరణం (Alimony) లేదా ఆస్తిని ఆశించలేదట. సోహైల్ కతూరియా పెద్ద బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ, ఆయన నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే విడాకుల అఫిడవిట్ సమర్పించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సెక్షన్ 13B కింద సీక్రెట్ డీల్!

హన్సిక, సోహైల్ దంపతులు సెక్షన్ 13B (హిందూ వివాహ చట్టం) కింద పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్ వేశారు. కోర్టులో ఒకరిపై ఒకరు బురద చల్లుకోకుండా, భవిష్యత్తులో కూడా ఒకరి ఆస్తిపై ఒకరికి ఎటువంటి హక్కులు ఉండవని క్లియర్ గా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2024 జూలై నుండే వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని, రాజీ చేసేందుకు కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా హన్సిక మాత్రం తగ్గేదేలే అని విడాకులకే మొగ్గు చూపిందని టాక్.

పబ్లిసిటీ స్టంట్ కాదు.. పక్కాగా లెక్క తేలిపోయింది!

సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు డిలీట్ చేసినప్పుడు, ఇదంతా సినిమా పబ్లిసిటీ కోసం ఆడుతున్న నాటకం అని చాలా మంది కామెంట్ చేశారు. కానీ కోర్టు పత్రాలు బయటకు రావడంతో అసలు లెక్క తేలిపోయింది. భరణం కోసం పైసా అడగకుండా, తన ఆత్మగౌరవమే ముఖ్యమని హన్సిక తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఆర్థికపరమైన డిమాండ్లు లేకుండా విడిపోవాలని ఆమె భావించడం వెనుక ఆమె సంపాదనపై ఆమెకున్న నమ్మకమే కారణమని అనుకుంటున్నారు.

వ్యక్తిగత జీవితంలో ఇంత పెద్ద దెబ్బ తగిలినా హన్సిక ఏమాత్రం కుంగిపోకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంది. చేతిలో 5-6 ప్రాజెక్టులతో పాటు ‘గాంధారి’ వంటి థ్రిల్లర్ మూవీలతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తోంది. బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటి, తన లైఫ్ లో ఎదురైన ఈ చేదు అనుభవాన్ని మర్చిపోవాలని ఆమె కసితో వర్క్ చేస్తోంది.

Similar Posts