ఛావా సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.120 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక సోమవారం రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా దాదాపు 30 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు వచ్చాయని ట్రేడ అంటోంది. దాంతో ఈ హిస్టారికల్ మూవీ బ్లాక్ బస్టర్ గా తేలిపోయింది. మరో వారం రోజుల్లో రూ.500 కోట్లకు పైగా నెట్ వసూలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక ఛావా సినిమాతో ఆల్ టైం బ్లాక్ బస్టర్ ని అందుకుంది రష్మిక మందన్న. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు గానూ నిర్మాతలు ఏకంగా రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం.
రీసెంట్ గా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోయిన్స్ బాలీవుడ్ లో రష్మిక తప్ప మరొకరు లేకపోవటమే ఈ రెమ్యనరేషన్ ఇవ్వటానికి కారణం అని తెలుస్తోంది.
గత ఏడాది వచ్చిన ‘యానిమల్’, ‘పుష్ప 2’ లతోపాటు ఇటీవల ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ‘ఛావా’ సినిమాలతో ఏకంగా హ్యాట్రిక్ అందుకొని సంచలనం సృష్టించింది.
పుష్ప 2, యానిమల్ చిత్రాలు కలిపి రూ.3వేల కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేయగా.. ఇప్పుడు ఛావా కూడా సరికొత్త సంచలనం సృష్టించబోతుందని చెప్పవచ్చు.