సినిమా అంటే గ్లామర్ మాత్రమే కాదు, కాసుల వర్షం కూడా! తాజాగా విడుదలైన ‘భారతదేశపు టాప్ 10 సంపన్న తారల’ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ స్టార్లతో పోటీ పడుతూ మన టాలీవుడ్ హీరోలు కూడా సత్తా చాటారు. అసలు మన హీరోల రేంజ్ ఏంటి? నెంబర్ వన్ ప్లేస్ ఎవరిది? అనే వివరాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
నెంబర్ 1 ప్లేస్‌లో ఆ ‘బాద్షా’.. ఆస్తి ఎంతో తెలుసా?
చాలా కాలంగా మొదటి స్థానాన్ని తన సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈయన ఆస్తి అక్షరాలా రూ. 7300 కోట్లు. కేవలం సినిమాలే కాదు.. ఐపీఎల్ టీమ్ (KKR), సొంత ప్రొడక్షన్ హౌస్, భారీ ఎండార్స్మెంట్లు షారుఖ్‌ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆ తర్వాత వరుసగా సల్మాన్ ఖాన్ (రూ. 6270 కోట్లు), అమితాబ్ బచ్చన్ (రూ. 5900 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
షాకింగ్: టాప్ 10లో ఒకే ఒక్క హీరోయిన్!
ఈ సంపన్న జాబితాలో హీరోల ఆధిపత్యం నడుస్తుంటే.. ఒకే ఒక్క నటి మాత్రం వారికి గట్టి పోటీ ఇస్తోంది. ఆమె ఎవరో తెలుసా? ఇప్పటి టాప్ హీరోయిన్లు కాదు.. సీనియర్ నటి జూహీ చావ్లా! ఆమె నికర ఆస్తుల విలువ రూ. 4600 కోట్లు. షారుఖ్‌తో కలిసి వ్యాపారాలు చేయడం, రియల్ ఎస్టేట్ పెట్టుబడులే ఆమెను ఈ స్థాయికి చేర్చాయి.
టాలీవుడ్ హీరోల పవర్: టాప్ 10లో మనోళ్లు ఇద్దరు!
బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మన తెలుగు హీరోలు, ఆస్తి విషయంలోనూ తక్కువ కాదని నిరూపించారు. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో మన టాలీవుడ్ నుంచి ఇద్దరు సీనియర్ స్టార్స్ చోటు దక్కించుకున్నారు:
మెగాస్టార్ చిరంజీవి: 40 ఏళ్ల సినీ ప్రస్థానం, వందల కోట్లు కురిపించే సినిమాలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో చిరు ఆస్తి రూ. 3000 కోట్లుగా తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో ఆయన 9వ స్థానంలో నిలిచారు.
కింగ్ నాగార్జున: కేవలం సినిమాలే కాదు.. అన్నపూర్ణ స్టూడియోస్, ఎన్ కన్వెన్షన్, పలు స్పోర్ట్స్ ఫ్రాంచైజీలతో నాగ్ వ్యాపారవేత్తగానూ దూసుకుపోతున్నారు. ఆయన ఆస్తి విలువ రూ. 2200 కోట్లు. ఈయన 10వ స్థానంలో ఉన్నారు.

