సినిమా వార్తలు

రామ్ చరణ్-సుకుమార్ మూవీ టైటిల్ ఇదే? ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ (Peddi) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే, అందరూ ఎదురుచూస్తున్న మార్చి 27 విడుదల తేదీపై కొంచెం సందిగ్ధత నెలకొంది. ఈ చిత్రం మే 1న లేదా దసరా కానుకగా వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ వెంటనే సుకుమార్ ప్రాజెక్ట్ (RC17) లోకి అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా, చరణ్‌లోని అసలైన నటుడిని బయటకు తీసింది. చిట్టిబాబుగా చరణ్ చూపించిన పెర్ఫార్మెన్స్ ఇప్పటికీ ఒక బెంచ్ మార్క్. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఏమిటా ‘బ్లాక్ హార్స్’?

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ‘బ్లాక్ హార్స్’ (Black Horse) అనే టైటిల్‌ను సుకుమార్ పరిశీలిస్తున్నారట. ఈ సినిమా పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్ కాకుండా, భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందట. అందుకే జేమ్స్ బాండ్ స్టైల్‌లో ఈ వెరైటీ టైటిల్‌ను ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంగ్లీష్ టైటిల్ వర్కవుట్ అవుతుందా?:

గతంలో టాలీవుడ్‌లో చాలా సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ అంతగా అచ్చిరాలేదు. మరి ఈ సెన్సేషనల్ కాంబోకు ఈ పేరును ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Similar Posts