‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నారు హీరో వెంకటేష్‌. 300కోట్ల పైచిలుకు వసూళ్లతో తెలుగు ప్రాంతీయ సినిమా కలెక్షన్స్‌లో రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. అదే సమయంలో వెంకటేష్ ని ఈ సినిమా పూర్తి కన్ఫూజన్ లో పడేసిందని టాక్. ఇప్పుడు ఇంత పెద్ద హిట్ తర్వాత ఏ సినిమా ఓకే చెయ్యాలనే విషయంలో సురేష్ బాబు, వెంకటేష్ ఇద్దరూ రోజు డిస్కషన్స్ చేస్తున్నారని, ఓ కొలిక్కి మేటర్ రాలేదని తెలుస్తోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం రోజు వెంకటేష్‌ కథల్ని వింటున్నారని తెలిసింది. అయితే సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఆయన సినిమా చేసే అవకాశం ఉందని వినిపిస్తున్నది.

ఇటీవలే వెంకటేష్‌ను కలిసి సురేందర్‌ రెడ్డి కథ చెప్పారని అంటున్నారు. అన్నీ కుదిరతే వెంకటేష్‌ ఈ సినిమాకు అంగీకరించే అవకాశాలున్నాయని సమాచారం. అయితే ఇప్పటికే నాలుగు నేరషన్స్ విన్న వెంకటేష్ …గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వలేదట.

ఈ ప్రాజెక్టుకు వక్కంతం వంశీ కథ,మాటలు అందిస్తున్నారట. ఈ మేరకు సురేష్ గెస్ట్ హౌస్ లో డిస్కషన్స్ జరుగుతన్నాయట. ప్రాజెక్టు ఫైనల్ అయ్యేదాకా ఏదీ చెప్పలేమని, అడ్వాన్స్ లు కూడా ఏమీ ఇవ్వలేదని తెలుస్తోంది.

ఇక వెంకటేష్‌ నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌ సెకండ్‌ సీజన్‌ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.

, ,
You may also like
Latest Posts from