కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ (Thug Life) చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో 38 ఏళ్ళ తర్వాత కమల్ హాసన్ నటించిన ఈ సినిమా జూన్ 5న రిలీజ్ కానుంది. శింబు (Silambarasan) కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. త్రిష (Trisha) , అభిరామి (Abhirami) హీరోయిన్లుగా నటించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ‘థగ్ లైఫ్’ సినిమా కన్నడ ప్రమోషన్ల కోసం ఇటీవల కమల్ బెంగళూరు వెళ్లడం జరిగింది.

అక్కడ మీడియాతో ముచ్చటించిన కమల్.. ‘ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) తన కుటుంబంలో వ్యక్తి లాంటి వారు… అందుకే ఇక్కడికి వచ్చాను. మీ భాష(కన్నడ) కూడా తమిళం నుండే పుట్టింది’ అంటూ పలికారు. ఆ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. కన్నడిగులు ఈ విషయం పై కమల్ హాసన్ ను ట్రోల్ చేస్తున్నారు.

కమల్ చేసిన ఈ కామెంట్స్ పై కర్నాటక రాజకీయ నాయకులు మరియు సంస్కృతిక సంఘాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ముఖ్యంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ వ్యాఖ్యపై తీవ్రంగా స్పందించారు. “భాషా, చరిత్రపై ప్రాథమిక జ్ఞానం కూడా లేకపోవడం బాధాకరం” అని పేర్కొన్నారు. దీంతో పలు కన్నడ సంఘాలు కమల్ హాసన్ సినిమాల బాయ్ కాట్ కోరుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

ఈ వివాదం ‘థగ్ లైఫ్’ కి ఊహించని పెద్ద షాక్ అయింది. జూన్ 5న విడుదల కానున్న ఈ చిత్రం కర్నాటక మార్కెట్‌లో తీవ్ర ప్రభావం చూపించవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.

, , , , , ,
You may also like
Latest Posts from