విలక్షణ నటుడిగా రాణిస్తున్న ప్రియదర్శి లీడ్ రోల్‌లో కొత్త డైరెక్టర్ రామ్ జగదీష్ కాంబినేషన్‌లో నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన సినిమా కోర్ట్. హోలి సందర్బంగా మార్చి 14 న రిలీజ్ అయిన కోర్ట్ మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే…భాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది.
హీరో ప్రియదర్శి గత సినిమాలు బలగం, మల్లేశం, జాతిరత్నాలతో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక నాని ప్రొడ్యూసర్ కావడంతో ఆయన బ్యానర్‌పై ఉన్న ఇంపాక్ట్ దృష్ట్యా కోర్ట్ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది.
ఆంధ్రా, నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మొత్తంగా రూ.10 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు తెలిపారు. అయితే 11 కోట్ల టార్గెట్ తో మూవీ రిలీజ్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 650 థియేటర్‌లలో విడుదలైన కోర్ట్ చిత్రం పాజిటివ్ రివ్యూలతో దూసుకెళ్తుంది.
తొలి రోజు 8 కోట్లు వసూల్ చేసింది. అలాగే రెండో రోజు 7 కోట్లు వసూల్ చేసింది. మొత్తంగా మూడో రోజు కోర్ట్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.2 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.7 కోట్ల వరకు వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
మూడు రోజులకు 24 కోట్లకు పైగా వసూల్ చేసిన ఈ మూవీ కలెక్షన్స్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ మూవీ స్పీడును చూస్తుంటే త్వరలోనే 50 కోట్లు రాబట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.