
వాళ్లంతా అంతకు అంతా అనుభవిస్తారు! ‘రాజా సాబ్’ డైరక్టర్ శాపాలు!
ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ జనవరి 9న విడుదలై భారీ వసూళ్లతో సంక్రాంతి సందడిని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకుందీ చిత్రం. దాంతో ట్రోలింగ్ ఓ రేంజిలో మొదలైంది. అదే సమయంలో ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. దాంతో సోషల్ మీడియాలో మారుతిపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైపోయింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే మరియు హారర్ ఎలిమెంట్స్ సరిగ్గా లేవని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
తాజాగా చిరంజీవి సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రిలీజ్ కావడంతో రాజా సాబ్‌కు పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో మారుతి ట్రోలర్లకు గట్టి సమాధానం ఇచ్చారు. రాజా సాబ్ నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేసినవారిపై మారుతీ మండిపడ్డాడు. తాజాగా గూగుల్ మీట్ లో జరిగిన ప్రెస్ మీట్ లో తన ఆవేదనను వెళ్లగక్కాడు. సినిమా తీయడం నాకు రావడం కాదు.. చూడడం మీకు రాదు అని ఫైర్ అయ్యాడు.
ఒకసారి చూస్తే సినిమా అర్ధం కాదని, మరోసారి వెళ్లి చూడమని సలహా ఇచ్చాడు. ఇక హీరోల మీద, సినిమా మీద ట్రోల్ చేసేవారికి మారుతీ శాపనార్ధాలు పెట్టాడు. అది శాపం కాదు తన బాధ అని చెప్తూనే వారు అనుభవిస్తారని శాపం పెట్టుకొచ్చాడు.
“గుర్తుపెట్టుకోండి.. 3 సంవత్సరాల కష్టం 3 గంటలు సినిమా తీసి చూపిస్తుంటే ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తున్నారు. సక్సెస్, ఫైయిల్యూర్ అని తేడా లేకుండా అన్నింటి మీద ట్రోల్స్ చేస్తున్నారు. వారి కష్టంపై జోక్స్ వేస్తూ శునకానందం పొందుతున్నారు. ఇంకొందరు తాము మేధావులు అనుకుంటూ సినిమా నచ్చింది అని చెప్పినవారిపై కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇదంతా నేచర్ చూస్తుంది.
ట్రోల్స్ చేసినవారు ఏదో ఒకరోజు బాధపడతారు. నేను ట్రోల్స్ చేసాను అని ఒక్కరే కూర్చొని అనవసరం ట్రోల్ చేశాను అని ఏడుస్తారు. ఇదంతా వాళ్లకు తిరిగి వస్తుంది. ఇది నా శాపం కాదు. నా బాధ. కచ్చితంగా వారిని కర్మ వదిలిపెట్టదు’ అని చెప్పుకొచ్చాడు.
