పెద్ద సినిమాల లీకులతో సోషల్ మీడియాలో హడావుడి చేసేవాళ్లకు ఇప్పుడు షాకే. గత కొద్ది కాలంగా మెగా స్టార్ సినిమాలకూ ఈ లీక్ కల్చర్ వెంటాడుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం #MEGA157 కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రాగా… మూవీ యూనిట్ ఫైర్ అయ్యింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్ లో ఇటీవల కేరళలోని హౌస్ బోట్ మీద చిరు, నయనతార షూటింగ్ చేస్తున్న వీడియో ఒక్కసారిగా సోషియల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై వెంటనే టీం స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ChiruAnil హ్యాష్‌ట్యాగ్‌తో రిలీజ్ చేసిన అధికారిక స్టేట్‌మెంట్‌లో ఇలా తెలిపారు:
“MEGA157 సెట్స్ నుండి అనధికారికంగా చిత్రాలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పంచుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మా క్రియేటివ్ ప్రాసెస్‌ను తీవ్రంగా దెబ్బతీసే చర్య. మేం ఎంతో శ్రమతో, ప్రేమతో ఈ సినిమా నిర్మిస్తున్నాం. లీక్‌ల వల్ల తాము తీస్తున్న కథను ముందుగానే బహిర్గతం చేయడం అన్యాయం. ఎవరైనా ఇలా చేస్తే వారిపై కాపీ రైట్, యాంటి పైరసీ చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుంటాం.”
ప్రస్తుతం Shine Screens, Gold Box Entertainments కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. చిరంజీవి ఇందులో శివ శంకర వరప్రసాద్ అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే… చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా లీక్‌ల కల్లోలం కొనసాగుతూనే ఉంది. అయితే మాస్ ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి సినిమా లీక్ అయితే… దానికి కౌంటర్గా మేకర్స్ తీసుకున్న స్టాండ్, మెగా ఫ్యాన్స్‌ను మరింత సీరియస్ చేస్తున్నది.
అఫీషియల్ అప్డేట్స్‌కే వేచి ఉండండి… మేకర్స్ చెప్తున్న మాట ఇదే!