38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ‘ఇది నాయకన్ రీబూట్ అవుతుందేమో!’ అని అభిమానులు ఊహించారు. కానీ విడుదలైన ‘థగ్ లైఫ్’ ఆ అంచనాలన్నింటినీ ఒక్కసారిగా నేలమట్టం చేసింది. ఇది ఓ సాధారణ ఫెయిల్యూర్ కాదు… మణిరత్నం కెరీర్లోనే అత్యంత ఇబ్బందికరమైన డిజాస్టర్ గా తేలింది.
సినిమాపై వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో మణిరత్నం స్పందిస్తూ ఇలా చెప్పారు:
“మేము మళ్లీ నాయకుడిని చేయాలనుకోలేదు. మేము కొత్తదాన్ని అన్వేషించాలనుకున్నాం. కానీ ప్రేక్షకుల ఊహలు మాకు కలిసినట్లుగా లేవు. వాళ్లు వేరే సినిమాను ఊహించారు… మేము వారికి వేరే సినిమాను ఇచ్చాము.”
ఇది కేవలం ఓవర్ఎక్స్పెక్టేషన్ వల్ల వచ్చిన సమస్య కాదు… అసలు సినిమా ఏ టోన్‌లో ఉండబోతుందో అన్న దానిపై ప్రేక్షకుల్లోనే ఒక తప్పుడు అంచనాలు ఏర్పడ్డాయని మణిరత్నం చెప్పకచెప్పేలా చెప్పేశాడు.
ఇక కమల్ హాసన్ విషయానికి వస్తే… థగ్ లైఫ్ ఫెయిల్యూర్ ఆయనను చాలా తీవ్రంగా దెబ్బతీసింది. ఆయన సన్నిహితుల మాటల్లోకి వెళ్తే –
“ఇది కమల్‌కి భావోద్వేగపూరితంగా షాక్‌లాంటి పరిణామం. మణిరత్నంతో కలిసి ఓ మాయాజాలాన్ని రీపీట్ చేస్తామనుకున్నాడు. కానీ విడుదలైన వెంటనే వచ్చిన నెగెటివిటీ ఆయనను తాకినట్టు కాదు… ఉక్కిరి బిక్కిరి చేసేసింది.”
ఈ నేపథ్యంలో కమల్ హాసన్ తక్షణంగా కొత్త ప్రాజెక్ట్‌లలోకి వెళ్లే పరిస్థితిలో లేడు. అంతే కాదు, రాజకీయంగా కూడా పెద్దగా కనిపించడంలేదు. ప్రస్తుతం పబ్లిక్ లైఫ్‌కి కాస్త విరామం తీసుకున్న ఆయన… ఇకపై ఏం చేస్తారో కూడా క్లియర్ కాదు.
ఓ వైపు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, మరోవైపు మహానటుడు కమల్ హాసన్…
ఇద్దరికి ఒకేసారి షాక్ ఇచ్చిన సినిమా ‘థగ్ లైఫ్’.
ఈ సినిమా వల్లే…
ఒక తరం నమ్మకాన్ని కోల్పోయింది,
ఇద్దరు లెజెండ్స్ తలదించుకున్నారు,
ఓ గోల్డెన్ కాంబో చీకట్లో కలిసిపోయింది.