ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన వైఖరి చూపిస్తోంది. ముఖ్యంగా మహిళలపై అసభ్యంగా మాట్లాడటం, మార్ఫ్ చేసిన ఫొటోలు షేర్ చేయడం, వ్యక్తిగత దూషణలు చేస్తూ ట్రోలింగ్‌కు పాల్పడటం లాంటి చర్యలకు ఇక పాలిటి చుక్కలు చూపించబోతున్నారు.
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కొన్ని మార్ఫింగ్ వీడియోలు, అసభ్య పోస్టులు వైరల్ కావడంతో జనసేన శ్రేణులు, అభిమానులు కంగారుపడ్డారు. “హరి హర వీరమల్లు” ప్రమోషన్స్‌లో ఉన్న పవన్‌పై టార్గెట్ చేస్తూ వీడియోలతో నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు కొందరు. దీనిపై స్పందించిన జనసేన కీలక నేత ఒకరు, “చర్చలు, విమర్శలు మేం స్వాగతిస్తాం. కానీ వ్యక్తిగత దూషణలు, ఫ్యామిలీలను లాగడం, మార్ఫింగ్ ఫొటోలు పెట్టడం అసహ్యకరమైన వ్యవహారం. తప్పించుకోలేరు. ఐపి అడ్రెస్‌తోపాటు అసలైన ఐడెంటిటీ ట్రాక్ చేసి, చట్టపరంగా శిక్షించతాం,” అని హెచ్చరించారు.
ఇప్పటికే సైబర్ క్రైమ్ శాఖ అలెర్ట్ అయింది. కేసులు నమోదు చేయడానికి సిద్ధంగా ఉంది. గతంలోలా ఊరుకోదు. ఈసారి చర్యలు తక్కువ కాదు. ఇక నుంచి సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలంటే పదిసార్లు ఆలోచించాల్సిందే. విమర్శలు ఓకే… కానీ అసభ్యకరమైన వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, మార్ఫింగ్‌కు ఇక ఫ్రీడమ్ లేదు.
మరోవైపు పవన్ నటించిన హరి హర వీరమల్లు చిత్రం జూలై 24న భారీగా విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్ల మళ్లీ ట్రాక్ మీదికి రావాలంటే, ఈ ట్రోలింగ్ దాడులపై ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలు కీలకమవుతాయి.