సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎనర్జీకి ఎక్కడ బ్రేక్ అనేది లేదు అనిపిస్తోంది. వయస్సుతో సంభందం లేకుండా ఆయన దూసుకుపోతున్నారు. “జైలర్” సినిమా సెన్సేషనల్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న 74 ఏళ్ల రజనీ, రిటైర్మెంట్ ఆలోచనలను పక్కనపెట్టి వరుసగా కొత్త ప్రాజెక్టులను సైన్ చేస్తున్నారు.
ఒక దశలో, ఆరోగ్య కారణాల వల్ల రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పొచ్చని వార్తలు వినిపించాయి. “జైలర్ 2” ఆయన చివరి చిత్రం అవుతుందన్న ఊహాగానాలూ వచ్చాయి. కానీ, ఇటీవలి కాలంలో ఆయన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన “కూలీ” సినిమా షూటింగ్‌ను పూర్తిచేశారు. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న విడుదల కానుంది.
ఇప్పుడు, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో “జైలర్ 2” షూటింగ్‌ను స్టార్ట్ చేయడానికి రజనీ సిద్ధమవుతున్నారు.
ఇదే సమయంలో, ఒక బిగ్ డెవలప్‌మెంట్ ఫిలింనగర్‌లో హీట్ క్రియేట్ చేస్తోంది. ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో రజనీకాంత్ ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ చిత్రానికి అనుగుణమైన డైరెక్టర్ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.
తమిళ్ ఇండస్ట్రీపై మైత్రీ ఫోకస్
తెలుగు ఇండస్ట్రీలో వరుసగా బ్లాక్‌బస్టర్లు అందించిన మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు తమిళ్ సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవలే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇది మొదటిదే కానీ చివరిది కాదు అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో తమిళ్‌లో కూడా స్టార్‌హీరోలతో భారీ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే…
సూపర్‌స్టార్ రజనీ కెరీర్ లో దూసుకుపోతూంటే, మైత్రీ మూవీ మేకర్స్ తన విస్తరణను బలంగా ముందుకు నడిపిస్తుంది. ఈ కలయిక నుంచి మరో మైల్‌స్టోన్ సినిమా రానుందన్న ఊహాగానాలు ఇప్పటికే మొదలయ్యాయి.