తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు, లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన కుమారుడు నాగార్జున హాట్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎన్నో ఏళ్ళుగా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నాగార్జున, ఇప్పుడు ఏఎన్‌ఆర్ జీవితాన్ని వెండితెరపైకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాడు.

ఓ ప్రముఖ తెలుగు డైలీతో మాట్లాడుతూ, నాగ్ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. చాలా రోజులుగా ఏఎన్‌ఆర్ బయోపిక్ గురించి తాను ఆలోచిస్తున్నానని, ఇప్పటికే స్క్రిప్ట్ , డైరెక్టర్ ఎంపికపై చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పాడు. సరైన రచయిత, దర్శకుడు దొరికితేనే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.

తెలుగు తెరపై ఎన్టీఆర్ బయోపిక్ వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి అక్కినేని అభిమానుల్లో ఏఎన్‌ఆర్ బయోపిక్‌పై ఆసక్తి పెరిగింది. కానీ నాగార్జున ఇప్పటివరకు పెద్దగా ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది.

మరి నిజంగా ఏఎన్‌ఆర్ బయోపిక్ వస్తే.. ఎవరు హీరోగా నటిస్తారు? నాగార్జునేనా? లేక నాగచైతన్య, అఖిల్‌లో ఎవరు ఆ పాత్రలో కనిపిస్తారా? అన్నదానిపై సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.

తరాలు మారినా తెలుగు నేలపై ఎప్పటికీ వినిపించే పేరు… అక్కినేని నాగేశ్వరరావు. వెండితెరకు రొమాంటిక్‌ రంగులద్దిన ఘనత ఆయనది. సాంఘిక కథలకి కేరాఫ్‌గా నిలుస్తూ… హుషారైన స్టెప్పులతో తెలుగు సినిమాని పరుగులు పెట్టించారు. ఆయన ప్రభావం నటుడిగానే కాదు… అన్నపూర్ణ స్టూడియోస్‌ని స్థాపించి మద్రాస్‌లో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమని హైదరాబాద్‌కి తీసుకు రావడంలోనూ కీలక పాత్ర పోషించారు.

మీరు ఏమి అనుకుంటున్నారు? ఏఎన్‌ఆర్ లాంటి లెజెండరీ రోల్‌ను ఎవరు బాగా చేయగలరు?

, , , , ,
You may also like
Latest Posts from