
నారా రోహిత్ – శిరీష ప్రేమకథ ఇప్పుడు జీవితమవుతోంది! గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతోంది.
అక్టోబర్ 30, 2025న హైదరాబాదులో వివాహం జరుగనుండగా, నాలుగు రోజుల పాటు ఘనమైన వేడుకలు ప్లాన్ చేశారు.
‘ప్రతినిధి 2’ సినిమాలో తనతో నటించిన అమ్మాయి శిరీష లేళ్లతో నారా రోహిత్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులను ఒప్పించిన ఇరువురు, ఏడు అడుగులు వేయడానికి రెడీ అయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో ‘పసుపు దంచడం’ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. పెళ్లి పనులు ప్రారంభించే ముందు పసుపు దంచడం సంప్రదాయం. దాంతో త్వరలో పెళ్లి జరుగుతుందని భావించారంతా. ఇప్పుడు ఆ శుభ ముహూర్తం వెల్లడించారు.
అధికారిక ప్రకటనలో ఇలా పేర్కొన్నారు –
“రెండు హృదయాలు, ఒక విధి, అంతులేని జ్ఞాపకాలు.”
తాజా సమాచారం ఏమిటంటే — శిరీష సుందరకాండలో కేమియోగా, ప్రతినిధి 2లో కీలక పాత్రలో కనిపించింది.
ఇప్పుడు ఆ రీల్ లవ్ స్టోరీ రియల్ లైఫ్ వెడ్డింగ్‌గా మారబోతోంది!
అక్టోబర్ 30న తమ పెళ్లి జరగనున్నట్లు నారా రోహిత్, శిరీష లేళ్ల తెలిపారు. నిజానికి గత ఏడాది వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణం వల్ల ఏడాది పాటు ఎదురు చూశారు.
ఫిల్మ్‌ఫేర్ స్థాయి వేడుక, సినీ కలల లా ఉండబోతోంది ఈ పెళ్లి!
