ఈ మధ్యన సైలెట్ గా ఉన్న హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కోకాపేటలో రాజ్ తరుణ్ ఇంట్లో నివసిస్తున్న లావణ్య వద్దకు అతని తల్లిదండ్రులు లగేజ్ తో సహా వెళ్లారు. ఇల్లు తమదంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఇక్కడ ఎవరి ఇల్లు లేదంటూ వారిని ఆమె అడ్డుకుంది.
అంతేకాకుండా వారు ఇంట్లోకి ప్రవేశించడాన్ని నిరాకరించింది.దీంతో రాజ్ తరుణ్ కుటుంబసభ్యులు విల్లా ముందు ధర్నాకు దిగారు. ఆ విల్లా తమదే అని, తమ కుమారుడు కష్టపడి సినిమాలు చేసిన డబ్బులతో ఈ ఇల్లు కొన్నాడని తెలిపారు. ఈ ఇంటిపై లావణ్యకు ఎలాంటి హక్కులు లేవని చెబుతున్నారు.
అనంతరం లావణ్య మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ తాను కలిసి ఈ ఇల్లు కొన్నామని.. ఇందుకు తాను రూ.70 లక్షలు ఇచ్చినట్లు పేర్కొంది. రాజ్ తరుణ్ తో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నప్పుడు… అతడు తనతో ఉంటాడని డబ్బులన్నీ తనకు ఇచ్చినట్టు తెలిపింది. ఇప్పడు అతడి తల్లిదండ్రులు ఈ ఇంటితో తనకు సంబంధం లేదంటున్నారని.. ఈ ఇంటిపై రాజ్తరుణ్ తో పాటు తనకు సమాన హక్కులు ఉన్నాయని వెల్లడించింది.
గతేడాది వీరిద్దరి మధ్య మెుదలైన గొడవతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు కూడా పెట్టుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం రాజ్తరుణ్పై పెట్టిన కేసులు లావణ్య వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది.