నితిన్ నటించిన “తమ్ముడు” ఇటీవల థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ, ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా ఇప్పుడు ఓటిటీలో లక్కు పరీక్షించుకోబోతోంది.

పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ తెరకెక్కించిన శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా – అన్నచెల్లెళ్ళ బంధాన్ని నేపథ్యంలో ఉంచుకొని, యాక్షన్‌, ఎమోషన్స్ మిక్స్‌ చేశారు. కానీ, బలహీనమైన నేరేషన్ కారణంగా థియేటర్లలో సరైన రెస్పాన్స్ రాలేదు.

ఇప్పుడు, నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను డిజిటల్ హక్కులతో కొన్నట్లు అధికారికంగా ప్రకటించబడింది. ఆగస్టు 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో “తమ్ముడు” స్ట్రీమింగ్‌కు సిద్ధం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

లయ, సప్తమి గౌడ, లబ్బర్ పందు ఫేమ్ స్వాసికా, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచదేవా కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఓటిటీలో కొత్తగా ఆడియన్స్‌ను ఆకట్టుకోగలదా అనేది చూడాలి!

, , , , ,
You may also like
Latest Posts from