సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ ప్రారంభానికి ముందే వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొణె లీడ్ రోల్ కోసం చర్చలు జరిపారు కానీ, కొన్ని షరతుల కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.

ఈ షరతులలో ముఖ్యంగా –

రోజుకి 8 గంటలే షూటింగ్

రూ.20 కోట్ల పారితోషికం

లాభాల్లో వాటా

తెలుగు డైలాగులు చెప్పకూడదని అభ్యర్థన

ఈ కండిషన్లను ‘ఓవర్ డిమాండ్’గా పేర్కొంటూ పలువురు విమర్శించినప్పటికీ, బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రీను ఆమె స్థానంలో తీసుకొచ్చారు. అయితే, ఈ వివాదానికి ఊతమిచ్చేలా ఓ దిగ్గజ దర్శకుడు బహిరంగంగా దీపికాకు మద్దతు పలికారు — ఆయనే మణిరత్నం.

“She Deserves It” – మణిరత్నం

న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ – “ఆమె చేసిన డిమాండ్లు నేను పూర్తిగా సరైనవే అనుకుంటున్నాను. అలాంటి స్థాయిలో డిమాండ్ చేసే స్థాయిలో ఉన్నదంటే అది ఆమె ఎదుగుదలకి సూచిక. వృత్తిపరమైన అంచనాలు, పనివేళలు ఇవన్నీ పరిశ్రమలో సరిగా నిర్వచించాల్సిన సమయం ఇది.”

అలాగే… ” చిత్ర పరిశ్రమలో వృత్తిపరమైన సరిహద్దులు ఉండాలి. ఫిల్మ్‌మేకర్స్ అలాంటి అవసరాలను గుర్తించి, అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా పనిచేయాలి” అని తెలిపారు.

నటులు కాదు నిస్సహాయులు కాదు – సోషియల్ మీడియా చర్చలో మారిన టోన్

ఈ వివాదంపై ఇప్పటికే అజయ్ దేవగణ్, సైఫ్ అలీ ఖాన్ మాదిరిగానే మణిరత్నం స్పందించడంతో పరిశ్రమలో వర్క్–లైఫ్ బ్యాలెన్స్, విమెన్ ఎక్స్‌పెరియన్స్‌, పే అండ్ అవర్ రిస్పెక్ట్ వంటి అంశాలు ఓ మేజర్ డిబేట్‌గా మారాయి.

అజయ్ దేవగణ్ వ్యాఖ్యలు గమనార్హం:

“ఈ విషయం చాలా మందికి రుచించడం లేదనడం సరికాదు. నిజాయితీగల చాలా మంది చిత్రనిర్మాతలకు దీంతో సమస్య ఉండదు. దీనికి తోడు తల్లిగా ఉంటూ ఎనిమిది గంటలు పనిచేయడం అనేది క‌ష్టం”.”

ఇది నటనలో పరిణతి – Glamour with Boundaries

దీపికా డిమాండ్లను అన్‌ప్రొఫెషనల్ అని విమర్శించిన వారికిప్పుడు ఇండస్ట్రీలో ఓ ప్రత్యామ్నాయ వాయిస్ వినిపిస్తోంది — “పని మీద గౌరవం ఉండాలంటే, పని గడువుపై స్పష్టత ఉండాలి” అనే స్పష్టత వస్తోంది.

మణిరత్నం వ్యాఖ్యలతో ఈ చర్చ మరింత ప్రొఫెషనల్ టర్న్ తీసుకుంది. ఇది నిర్మాతలకు, నటీనటులకు మాత్రమే కాదు – మొత్తం ఇండస్ట్రీ మానసిక దృక్పథానికి కూడా ఓ హెచ్చరిక.

ఇక ‘థగ్ లైఫ్’ తర్వాత మణిరత్నం

కమల్ హాసన్‌తో కలిసి రూపొందించిన ‘థగ్ లైఫ్’ జూన్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో మణిరత్నం ఓ దశ ముగించుకుని, కొద్దికాలం విరామం తీసుకోనున్నారని సమాచారం.

ప్రస్తుతం తన దగ్గర నాలుగు స్క్రిప్ట్‌లు ఉన్నాయని… కానీ వాటిలో ఏదీ ఇంకా పూర్తిగా రెడీ కాలేదని ఆయన వెల్లడించారు.

, , , ,
You may also like
Latest Posts from