సినిమా వార్తలు

ఆస్కార్ 2026 నామినేషన్స్ వచ్చేసాయి: ‘సిన్నర్స్’ సరికొత్త రికార్డు.. టైటానిక్ పేరు మీదున్న రికార్డు బద్దలు!

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు వేచి చూస్తున్న ‘ఆస్కార్ నామినేషన్స్ 2026’ను అకాడమీ ప్రకటించింది. మార్చి 15న జరగబోయే ప్రధాన అవార్డుల ప్రదానోత్సవానికి ముందు, ఈసారి నామినేషన్లలో రేయాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ‘సిన్నర్స్’ (Sinners) ప్రభంజనం సృష్టించింది.

చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’.. 16 నామినేషన్లతో టాప్!
ఇప్పటివరకు ‘టైటానిక్’, ‘లా లా ల్యాండ్’ చిత్రాల పేరు మీద ఉన్న 14 నామినేషన్ల రికార్డును ‘సిన్నర్స్’ బద్దలు కొట్టింది. ఏకంగా 16 కేటగిరీల్లో నామినేట్ అయ్యి ఈ చిత్రం ఆస్కార్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దీని తర్వాత ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ ఎక్కువ నామినేషన్లు దక్కించుకుంది.

ముఖ్యమైన విశేషాలు:

ఈ ఏడాది నుంచి మొదటిసారిగా ‘బెస్ట్ కాస్టింగ్ డైరెక్టర్’ విభాగంలో కూడా అవార్డులు ఇవ్వనున్నారు.

డెల్రాయ్ లిండో రికార్డు: 73 ఏళ్ల వయసులో డెల్రాయ్ లిండో తొలిసారి ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు.

పోటీలో 10 చిత్రాలు: ఉత్తమ చిత్రం (Best Picture) కేటగిరీలో ఈసారి 10 సినిమాలు పోటీ పడుతున్నాయి.

ప్రధాన విభాగాల్లో నామినేషన్ల జాబితా:

ఉత్తమ చిత్రం (Best Picture)

సిన్నర్స్

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

బగోనియా

ఎఫ్-1

ఫ్రాంకిన్‌స్టన్

హ్యామ్‌నెట్

మార్టీ సుప్రీం

ది సీక్రెట్ ఏజెంట్

సెంటిమెంటల్ వాల్యూ

ట్రైన్ డ్రీమ్స్

ఉత్తమ దర్శకత్వం (Best Director)
రేయాన్ కూగ్లర్ (సిన్నర్స్)

క్లోయి జావ్‌ (హ్యామ్‌నెట్)

పాల్ థామస్ ఆండ్రూసన్ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

జాష్ షాఫ్డీ (మార్టీ సుప్రీం)

యోఆకీమ్ ట్రియర్ (సెంటిమెంటల్ వాల్యూ)

ఉత్తమ నటుడు (Best Actor)
తిమోతి చాలమేట్ (మార్టీ సుప్రీం)

లియోనార్డ్ డికాప్రియో (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్)

ఈథన్ హాక్ (బ్లూ మూన్)

వాగ్నర్ మౌరా (ది సీక్రెట్ ఏజెంట్)

ఉత్తమ నటి (Best Actress)
ఎమ్మా స్టోన్ (బగోనియా)

జస్సీ బక్లీ (హ్యామ్‌నెట్)

రోజ్ బర్న్ (ఇఫ్ ఐ హాడ్ లెగ్స్ ఐ వుడ్ కిక్ యు)

కేట్ హడ్సన్ (సాంగ్ సంగ్ బ్లూ)

రెనాటా రైన్సావా (సెంటిమెంటల్ వాల్యూ)

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం (Best International Film)
ది సీక్రెట్ ఏజెంట్ (బ్రెజిల్)

సెంటిమెంటల్ వాల్యూ (నార్వే)

ఇట్ వాజ్ ఏ జస్ట్ యాక్సిడెంట్ (ఫ్రాన్స్)

సిరాట్ (స్పెయిన్)

ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ (తునీషియా)

ఈ ఏడాది ఆస్కార్ రేసులో ‘సిన్నర్స్’ మరియు ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ మధ్య హోరాహోరీ పోరు సాగేలా కనిపిస్తోంది. మరి మార్చి 15న ఆ గోల్డెన్ విగ్రహాన్ని ముద్దాడే విజేతలు ఎవరో తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే!

Similar Posts