విష్వక్‌సేన్‌ హీరోగా దర్శకుడు రామ్‌నారాయణ్‌ తెరకెక్కించిన చిత్రమే ‘లైలా’ (Laila). ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) హీరోయిన్‌ గా చేస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈసందర్భంగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో.. తన పాత్రకు సంబంధించిన విశేషాలు చెబుతూ 150 మేకల్లో చివరకు 11 మిగిలాయని నటుడు పృథ్వీరాజ్‌ (Prudhvi Raj) చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ సినిమాని బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ మొదలైంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ఇప్పటివరకూ లక్షా 50వేలకు పైగా పోస్ట్‌లు షేర్‌ అయ్యాయి.

విష్వక్‌ సేన్‌ (Vishwak Sen), చిత్ర నిర్మాత సాహు గారపాటి ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. అయినా ‘లైలా’కు వ్యతిరేకంగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌లు మాత్రం ఆగడం లేదు. తాజాగా దీనిపై విష్వక్‌సేన్‌ మరోసారి స్పందించారు. తనను, తన సినిమాను (Laila) రాజకీయాల్లోకి లాగొద్దంటూ పోస్ట్‌ పెట్టారు.

ఈ సినిమా పాట పోస్టర్‌లను విష్వక్‌ సేన్‌ షేర్‌ చేశారు. ‘‘నా సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్‌.. నా సినిమాకు సంబంధించింది మాత్రమే. సినిమాల పోస్టర్స్‌, పోస్ట్‌లను షేర్‌ చేసే ప్రతిసారీ రెండుసార్లు ఆలోచించలేను. ఈ ఫొటోలో ఉంది సోనూ మోడల్‌.. ఫిబ్రవరి 14న మీ ముందుకు వస్తున్నాడు’’ అని అన్నారు.

ఎక్స్‌లో ట్రెండ్‌ అవుతోన్న బాయ్‌కాట్‌ లైలా హ్యాష్‌ట్యాగ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ నేను ప్రతిసారీ తగ్గను. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో జరిగిన దానికి నిన్న మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాను. అతిగా ఆలోచించొద్దు. ప్రశాంతంగా ఉండండి. మళ్లీ చెబుతున్నాను.. నేను నటుడిని మాత్రమే. నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు’’ అని విష్వక్‌సేన్ చెప్పారు.

, , ,
You may also like
Latest Posts from