మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ రేంజ్ చర్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ 125 మిలియన్ల వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చరణ్ మాస్ స్వాగ్, జాన్వీ కపూర్ గ్లామర్ చూస్తుంటే ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.
రూమర్లకు చెక్.. క్లారిటీ ఇచ్చేసిన టీమ్!
గత కొద్దిరోజులుగా ‘పెద్ది’ విడుదల వాయిదా పడుతుందని, అనుకున్న సమయానికి రావడం కష్టమని సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. దీనిపై మెగా అభిమానులు కాస్త ఆందోళన చెందారు. అయితే, ఆ రూమర్లన్నింటికీ మూవీ టీమ్ ఒక్క పోస్ట్‌తో ఫుల్‌స్టాప్ పెట్టేసింది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. సినిమా విడుదల తేదీపై టీమ్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 27నే ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్నాడు.
ఆ తేదీ వెనుక ఉన్న సెంటిమెంట్ ఏంటి?
మార్చి 27 అనేది కేవలం ఒక డేట్ మాత్రమే కాదు.. అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు! తన బర్త్‌డే కానుకగా ఫ్యాన్స్‌కు అంతకంటే పెద్ద ట్రీట్ ఏముంటుంది? అందుకే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసి, అదే రోజున బాక్సాఫీస్ వేట మొదలుపెట్టాలని బుచ్చిబాబు అండ్ టీమ్ గట్టి పట్టుదలతో ఉన్నారు.

