ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గతేడాది విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ ఉన్నట్లు ఇప్పటికే చిత్ర టీమ్ వెల్లడించిన విషయం తెలిసిందే.

ఆ మధ్యన ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ ఓ ఇంటర్వ్యూలో ‘కల్కి 2’ గురించి మాట్లాడారు. అలాగే డైరెక్టర్‌ నాగ్‌అశ్విన్‌ ఈ చిత్రం రిలీజ్ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

ఒక తమిళ్ ఈవెంట్లో కల్కి వన్ రిలీజ్ అయినప్పుడు ఒక మూడు నాలుగు ప్లానెట్స్ అలైన్ అయ్యాయి. కల్కి టు రిలీజ్ అవ్వాలంటే కనీసం ఏడు ఎనిమిది ప్లానెట్స్ అలైన్ అవ్వాల్సి ఉంది అంటూ ఆ ప్రశ్నను చాలా తెలివిగా దాటేసాడు. ఈ సీక్వెల్ చిత్రం పట్టాలెక్కాలంటే ప్రభాస్ ప్రస్తుతం కమిట్ అయి సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది.

అశ్వనీదత్ మాట్లాడుతూ.. ‘‘కల్కి 2’ వచ్చే ఏడాది విడుదలవుతుంది. రెండో పార్ట్‌ మొత్తం కమల్‌హాసనే ఉంటారు. ప్రభాస్‌ (Prabhas), కమల్‌ హాసన్‌ల మధ్య సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్‌ బచ్చన్‌ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఈ మూడు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి.

వీళ్లే ఆ సినిమాకు మెయిన్‌. వీళ్లతో పాటు దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. కొత్త వాళ్లు ఉంటారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్‌లో కొత్త వాళ్లు ఉండే అవకాశం ఉంది’’ అని అన్నారు.

ఇక నాగ్అశ్విన్‌ గురించి అశ్వనీదత్‌ (Ashwini Dutt) మాట్లాడుతూ.. మంచి దర్శకుడని కొనియాడారు. ‘‘మహానటి’ సినిమా తీసే సమయంలో ఎక్కడా భయం లేకుండా షూటింగ్‌ పూర్తి చేశాడు.

తర్వాత ‘కల్కి’ రూపొందించాడు. రెండూ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. నాగ్‌ అశ్విన్‌కు జీవితంలో ఓటమనేది ఉండదని నేను నమ్ముతాను. అతడి ఆలోచనా విధానం, సినిమాలను తెరకెక్కించే తీరు చాలా గొప్పగా ఉంటాయి’’ అని చెప్పారు.

వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రంలో అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌.. అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు.

విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్‌ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌ చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు.

, , , , , ,
You may also like
Latest Posts from