‘లక్కీ భాస్కర్’తో తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మల్టీ లింగ్వల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో మ్యాజికల్ లవ్ స్టోరీలో అడుగు పెట్టేశాడు. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకం మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆ సంస్థలో ప్రొడక్షన్ నంబర్ 10 ఇది. హీరోగా వర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ 41వ సినిమా. దీంతో రవి నేలకుడిటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దుల్కర్, పూజ జంటగా నటిస్తున్న విషయాన్ని మేకింగ్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.

ఈ లవ్ స్టోరీకి “హార్ట్ ఆఫ్ ది స్టోరీ”గా పూజా హెగ్డే ఎంట్రీ ఇచ్చింది. మేకర్స్ రిలీజ్ చేసిన బీటీఎస్ వీడియోలో పూజా స్కూటీ నడుపుతుంటే, వెనుక దుల్కర్ కూర్చుని కనిపించే ఫ్రేమ్ నిజంగానే మ్యాజికల్‌గా ఉంది.

సినిమాలో పూజా ఒక కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తోంది. ఇక జివి ప్రకాశ్ కంపోజ్ చేస్తున్న మ్యూజిక్ ఈ మ్యాజికల్ కెమిస్ట్రీకి మరో లేయర్‌ జోడించింది. బీటీఎస్ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విన్న వాళ్లు “ఈ లవ్ స్టోరీలో ఏదో అద్భుతం దాగి ఉంది” అంటూ ఫీలవుతున్నారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో పూజా–దుల్కర్ జోడీ చర్చకు దారితీస్తోంది. “ఈ జంట స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా? లేక మరీ సాధారణంగా మిగిలిపోతుందా?” అనే డిబేట్ మొదలైంది.

మేకర్స్ మాత్రం “ఇంకా చాలా సర్ప్రైజ్‌లు ఉన్నాయి” అంటూ ఆసక్తి రేపుతున్నారు.

, , , , , ,
You may also like
Latest Posts from