ఎప్పటికీ టాప్‌గానే ఉండిపోవడం అనేది చాలా కొద్దిమందికే సాధ్యమయ్యే విషయం. రాశి ఖన్నా ఓ టైమ్ లో టాప్ హీరోయిన్‌గానే దూసుకుపోయింది. “సుప్రీమ్”, “తొలిప్రేమ”, “ప్రతిరోజూ పండగే” లాంటి హిట్స్‌తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. కానీ ఈ మధ్యన తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. బాలీవుడ్, కోలీవుడ్, ఓటిటి సినిమాలపై ఫోకస్ పెట్టేసరికి… ఇక్కడ మళ్లీ కనపడలేదు.
గతేడాది ఏకంగా ఒక్క తెలుగు సినిమా చేసింది. సిద్ధూ జొన్నలగడ్డతో చేసిన ఆ సినిమాకి కూడా పెద్దగా హైప్ రాలేదు. అచ్చంగా బ్లాంక్ అయిపోయిన రాశి ఖన్నాకు ఇప్పుడు మళ్లీ పెద్ద బ్రేక్ వచ్చేసింది.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” లో రెండో హీరోయిన్‌గా రాశిని తీసుకున్నారు. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో జాయిన్ అయిందని సమాచారం. శ్రీలీల ఫస్ట్ హీరోయిన్‌గా నటిస్తుండగా… రాశి ఎంట్రీతో సినిమాకి మోర్ గ్లామర్ అండ్ బజ్ వచ్చేసింది.
ఈ సినిమా రాశి ఖన్నా కెరీర్‌కి తిరుగులేని మళ్లీ బూస్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ క్రేజ్ తో పాటు, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మార్క్‌తో ఈ సినిమా రాశికి మళ్లీ తెలుగులో ఓ అదిరిపోయే రీఎంట్రీ కావొచ్చు.