
పుష్పరాజ్‌కే చెక్.. రణవీర్ మాస్ ర్యాంపేజ్! ‘ధురంధర్’ దెబ్బకు పుష్ప 2, RRR రికార్డులు ఖతం!
థియేటర్లలో ఇప్పుడు ఒక్కటే సౌండ్.. అదే రణవీర్ సింగ్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వేట! 2025 ఎండింగ్‌లో (డిసెంబర్ 5) మొదలైన ఈ స్పై థ్రిల్లర్ తుఫాను, 2026లో కూడా తగ్గడం లేదు సరికదా.. ఇంకా పీక్స్‌లో నడుస్తోంది. నాలుగు వారాలు దాటినా కలెక్షన్లు డబుల్ డిజిట్ దాటడం చూస్తుంటే, బాక్సాఫీస్ దగ్గర రణవీర్ ‘గాడ్ మోడ్’ ఆన్ చేశాడని అర్థమవుతోంది.
పుష్పరాజ్‌కే షాక్.. హిందీ మార్కెట్ లో రణవీర్ ఈజ్ ది న్యూ కింగ్!
ప్రస్తుతం నార్త్ ఇండియాలో హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ (830 కోట్లు) రికార్డ్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ పేరు మీద ఉంది. కానీ ఇప్పుడు ఆ రికార్డ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ‘ధురంధర్’ ఇప్పటివరకు 820 కోట్లు రాబట్టింది. ఇంకో పది కోట్లు వస్తే చాలు.. పుష్పరాజ్‌ను దాటేసి హిందీ మార్కెట్ లో నంబర్ 1 సింహాసనాన్ని రణవీర్ అధిరోహిస్తాడు. ఇది జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే అని ట్రేడ్ పండితులు ఫిక్స్ అయిపోయారు!
RRR గ్లోబల్ రికార్డ్స్ కూడా ఖేల్ ఖతం!
కేవలం పుష్పనే కాదు, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్ బస్టర్ RRR (1230 కోట్లు) వరల్డ్ వైడ్ గ్రాస్ రికార్డ్‌ను కూడా ధురంధర్ దాటేయబోతోంది. ఇప్పటికే 1200 కోట్లు కొల్లగొట్టిన రణవీర్, మరో రెండు మూడు రోజుల్లో ఎన్టీఆర్, చరణ్‌ల రికార్డ్‌ను బ్రేక్ చేసి ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్స్ లిస్టులో నాలుగో స్థానానికి (దంగల్, బాహుబలి 2, పుష్ప 2 తర్వాత) చేరడం పక్కా!
ఆదిత్య ధర్ ‘మెగా’ ప్లాన్ వర్కవుట్ అయ్యిందిగా!
డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ సినిమాను ఒక విజువల్ వండర్‌లా తెరకెక్కించడమే కాకుండా, రణవీర్ సింగ్‌ను ఎవరూ ఊహించని రేంజ్ లో ప్రజెంట్ చేశారు. ఈ స్పై థ్రిల్లర్ ఇస్తున్న కిక్కుతో నార్త్ ఆడియన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 850 కోట్ల నెట్ కలెక్షన్స్ టచ్ చేసేలా ఉంది.
