సినిమా వార్తలు

శ్రీకాంత్ కొడుకు నెక్స్ట్ పక్కా ‘హిట్’ ! ఎలా చెప్పచ్చంటే…

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రోషన్, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటున్నాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ఛాంపియన్’ సినిమాపై రిలీజ్ కు ముందు ఇండస్ట్రీలో భారీ హైప్ నెలకొంది. రోషన్ మేకోవర్, ఫిజిక్ చూసి అందరూ షాక్ అయ్యారు.

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ఒక కమర్షియల్ హీరోకు కావాల్సిన డాన్స్, ఫైట్స్, యాక్టింగ్‌లో రోషన్ ‘ఛాంపియన్’ అనిపించుకున్నాడు. ఈ సినిమా ఫ్లాప్ ప్రభావం రోషన్ క్రేజ్‌పై అస్సలు పడలేదు సరే కదా.. టాలెంటెడ్ హీరో కోసం వెతుకుతున్న దర్శకుల కళ్లు ఇప్పుడు రోషన్‌పై పడ్డాయి. ఒక మంచి హిట్ పడితే రోషన్ రేంజ్ ఎక్కడికో వెళ్తుందని ట్రేడ్ వర్గాలు సైతం గట్టిగా నమ్ముతున్నాయి.

‘హిట్’ డైరెక్టర్‌తో రొమాంటిక్ రైడ్!

‘ఛాంపియన్’ తర్వాత గ్యాప్ తీసుకోకూడదని ఫిక్స్ అయిన రోషన్, తన నెక్స్ట్ సినిమాను ఒక క్రేజీ డైరెక్టర్‌తో లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ‘హిట్’ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు శైలేష్ కొలనుతో రోషన్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడట.

శైలేష్ అంటేనే సీరియస్ యాక్షన్ డ్రామాలు గుర్తొస్తాయి, కానీ ఈసారి రోషన్ కోసం ఆయన ఒక ‘ఫ్రెష్’ రొమాంటిక్ కామెడీ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ వెరైటీ కాంబినేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

జనవరిలో బ్లాస్ట్.. సమ్మర్‌లో షూటింగ్!

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు టాక్. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ తోడవ్వడం రోషన్ కెరీర్‌కు గట్టి పునాది కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన జనవరిలో రానుంది.

ప్రస్తుతం రోషన్ కొంత విరామం తీసుకుంటుండగా, సమ్మర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘పెళ్లి సందడి’ తర్వాత మూడేళ్లు గ్యాప్ ఇచ్చిన రోషన్, ఇకపై వరుస పెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని పక్కా స్కెచ్‌తో ఉన్నాడు.

Similar Posts