హీరో సాయి దుర్గా తేజ్ లేటెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సంబరాల ఏటిగట్టు’. సాయి కెరీర్‌లోనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్. వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారనే టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్. ఈ చిత్రాన్ని మొదటగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడీ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. ఈ మేరకు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

అందుకు కారణం అదే రోజున పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ‘ఓజీ’ రాబోతుంది. కాబట్టి తేజ్ ఆ రోజుకు సినిమా రిస్క్ చేయడంటూ అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా మాత్రం చిత్ర టీమ్ అధికారికంగా వాయిదా ప్రకటించింది.

అయితే కారణం? స్ట్రైక్‌తో షూటింగ్ నిలిచిపోవడం, పెండింగ్‌లో ఉన్న సీజీ వర్క్స్! ఇదే అసలు కారణమని ప్రైమ్ షో ప్రొడక్షన్స్ క్లారిటీ ఇచ్చింది.

. ”సంబరాల ఏటిగట్టు’ మా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటి. పవర్ ఫుల్ స్టోరీని ప్రపంచ స్థాయి టెక్నికల్ ప్రమాణాలతో బెస్ట్‌గా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాం. ఊహించని స్ట్రైక్, కొన్ని కీలక CG పనుల కారణంగా ఆడియన్స్‌కు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు సినిమా విడుదల తేదీ వాయిదా వేయాలని నిర్ణయించాం. మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎంతో డెడికేషన్‌తో ఈ ప్రాజెక్టు కోసం శ్రమిస్తున్నారు. అలాగే మా డైరెక్టర్ రోహిత్ కెపి తన డ్రీమ్ ప్రాజెక్టును సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించేందుకు ఎంతో నిబద్ధతో ఏళ్లుగా వర్క్ చేస్తున్నారు. బెస్ట్ క్వాలిటీ అవుట్‌పుట్ అందించేందుకు మేము ఎక్కడా రాజీ పడడం లేదు. మూవీ స్టార్టింగ్ నుంచి మాకు సపోర్ట్ చేస్తోన్న మీడియా మిత్రులకు, ఆడియన్స్‌కు కృతజ్ఞతలు. ఫ్యూచర్‌లో మీకు గుర్తుండిపోయే మూవీని అందిస్తాం. కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తాం.’ అంటూ రాసుకొచ్చారు.

గతంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి బడ్జెట్ సమస్యలే అని వార్తలు రావడం, ఇప్పుడు ఆ రూమర్స్‌కు ఈ అఫీషియల్ స్టేట్‌మెంట్ సమాధానం ఇచ్చినట్టే. “సినిమా లేట్ అయినా పర్వాలేదు… కానీ క్వాలిటీ విషయంలో మాత్రం రాజీ పడం” అని టీమ్ నమ్మకంగా చెబుతోంది.

రోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా కోసం హైదరాబాద్‌లోనే భారీ సెట్లు వేశారు. దాదాపు 90% షూటింగ్ అక్కడే చేయబోతున్నారు. ఇప్పటివరకూ వ‌చ్చిన ఫుటేజ్ పట్ల టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉందట.

అయితే సర్‌ప్రైజ్ ఏమిటంటే… ఈ సంవత్సరం సినిమా రావడం అసాధ్యం. 2025లో కూడా డౌటే. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ‘సంబరాల ఏటిగట్టు’ బహుశా 2026 సమ్మర్‌కి మాత్రమే థియేటర్లలో సందడి చేస్తుందట!

, , , , , ,
You may also like
Latest Posts from