ప్రస్తుతం జపాన్ అనేది ఇండియన్ సినిమాకు మంచి మార్కెట్ గా తయారైంది. ముఖ్యంగా మన తెలుగు సినిమావాళ్లు అక్కడ సినిమా రిలీజ్ లు భారీగా చేస్తున్నారు. అక్కడ అభిమాన సంఘాలు కూడా మన హీరోలకు వెలుస్తున్నాయి.

రీసెంట్ గా ఎన్టీఆర్ అక్కడ తన దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ లో తుఫాన్ రేపారు. అలాగే ప్రభాస్, రామ్ చరణ్ లకు కూడా అక్కడ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆ లీగ్ లో అడవి శేషు ప్రవేశించబోతున్నారు.

26/11 అటాక్స్ నేపథ్యంలో రూపొందిన సినిమా మేజర్. సోనీ పిక్చర్స్ తో పాటు మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. అడివి శేష్ టైటిల్ పాత్రలో నటించాడు.

శశికిరణ్ తిక్కా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్యాన్ ఇండియా రేంజ్ లో పెద్ద విజయం సాధించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా రూపొందిన ఈ మూవీతో శేష్ దేశవ్యాప్తంగా అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాడు.

శేష్ తో పాటు సాయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, శోభిత ధూళిపాల, రేవతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు జపాన్ లో ప్రదర్శించబోతున్నారు.

అయితే ఇది కేవలం మార్కెట్ కోసం కాకుండా ఇండియన్ సినిమా కల్చర్ ను అక్కడ చూపించేందుకు కూడా ప్రదర్శించబోతున్నారు. ఈ నెల 29న అక్కడి లోకల్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు, 4 గంటల 50 నిమిషాలకు మేజర్ మూవీ స్క్రీనింగ్ కాబోతోంది.

అయితే ఈ చిత్రాన్ని జపనీస్ భాషలోకి డబ్ చేయలేదు. అక్కడ జపనీస్ సబ్ టైటిల్స్ వేస్తారు. ఇక జపాన్ నుంచి మన మేజర్ కు ఎలాంటి అప్లాజ్ వస్తుందో చూడాలి.

, , , ,
You may also like
Latest Posts from