విక్టరీ వెంకటేష్(Venkatesh Daggubati), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయ్యి…. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రిలీజై ఇన్ని రోజులైనా ఇప్పటికీ ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఆల్రెడీ ‘రంగస్థలం’ ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ ని దాటేసింది. ఈ ఆదివారం చాలా థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే, సంక్రాంతికి వస్తునం ఆల్-టైమ్ తెలుగు టాప్ 10 సినిమాల లిస్ట్ లోకి ప్రవేశించింది. ఆ లిస్ట్ చూద్దాం.

ఆల్ టైమ్ టాప్ 10 షేర్స్ (తెలుగు వెర్షన్స్) :

RRR
బాహుబలి 2
పుష్ప 2
కల్కి 2898 AD
సలార్
దేవర
బాహుబలి
అల వైకుంఠపురములో
సరిలేరు నీకెవ్వరు
సంక్రాంతికి వస్తున్నాం

సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 12 రోజుల్లో రూ.126.5 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.85.5 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయింది.

, , ,
You may also like
Latest Posts from ChalanaChitram.com