‘గీత గోవిందం’ సక్సెస్‌ తరువాత ఆయన మరో సరైన కమర్షియల్‌ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు విజయ్ దేవరకొండ.ఈ క్రమంలో రెగ్యులర్‌ కథలకు స్వస్తి చెప్పి విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వేసవిలో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీంతో పాటు ‘టాక్సీవాలా’ ఫేమ్‌ రాహుల్‌ సంకృత్యన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆ వివరాలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి.

విజయ్‌ దేవరకొండ హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్‌ టైటిల్‌). మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. కాగా ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా సెట్‌ వర్క్‌ని ప్రారంభించారు మేకర్స్‌.

‘‘బ్రిటీష్‌ పాలనా కాలం నేపథ్యంలో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రం ‘వీడీ 14’. ఇప్పటి వరకూ ఎవరూ తెరకెక్కించని కథాంశంతో ఒక పవర్‌ఫుల్‌ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.త్వరలోనే షూటింగ్‌ప్రారంభిస్తాం’’ అని రాహుల్‌ సంకృత్యాన్‌ పేర్కొన్నారు.

‘‘19వ శతాబ్దం నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి అయింది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.

ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేక సెట్‌ను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన సెట్‌ వర్క్‌ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

,
You may also like
Latest Posts from