కామెడీకు కేరాఫ్ ఎడ్రస్ లాంటి శ్రీవిష్ణు ఇప్పుడు మరో కామెడీ సినిమాకు సై అన్నాడు. శ్రీ విష్ణు గీతా ఆర్ట్స్ సమర్పణలో ఓ కామెడీ సినిమా చేస్తున్నాడు. నిను వీడని నీడను నేనే ఫేం కార్తీక్ రాజు ఈ సినిమాకి దర్శకత్వం. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మాతలు. ఈ సినిమాకి ‘సింగిల్’ అనే క్యాచి టైటిల్ పెట్టారు. టైటిల్ గ్లింప్స్ ని చాలా ఫన్నీగా కట్ చేశారు.

https://www.youtube.com/watch?v=d3bbZsRTxNk

ఈ టీజర్ వెన్నెల కిషోర్ పై ఓపెన్ అవుతుంది. ”ముడ్డి కిందకి ముఫ్ఫై ఐదేళ్ళు వచ్చినా నాకు ఇంకా పెళ్లి కాకపోవడానికి కారణం వాడే. దరిద్రానికి దత్త పుత్రుడు.. నా చిన్ననాటి మిత్రుడు’ అని చెప్పిన ఇంట్రోతో శ్రీ విష్ణు పరిచయం కావడం గమ్మత్తుగా వుంది. టీజర్ హీరోయిన్స్ కేతిక, ఇవానకి కూడా చోటు దక్కింది.

విశాల్ చంద్ర శేఖర్ ఇచ్చిన ఆర్ఆర్, వెల్‌రాజ్ కెమరాపనితనం లైటర్ వెయిన్ ఎంటర్ టైన్మెంట్ సరిగ్గా నప్పాయి.

సామజవరగమన తో హిట్ కొట్టిన శ్రీవిష్ణు, స్వాగ్ దెబ్బ తిన్నాడు. ఇప్పుడు సింగిల్ తో మళ్ళీ తన జోన్ లోకి వచ్చాడని టైటిల్ టీజర్ హింట్ ఇచ్చింది.

ఇది శ్రీవిష్ణు 18వ చిత్రం. ఈ చిత్రానికి కార్తిక్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.

#Single, #Sree Vishnu

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *