సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తన కూతురు సితార 13వ పుట్టినరోజు వేడుకల కోసం హైదరాబాద్ నుంచి విదేశానికి బయలుదేరారు. ఆయన ఎయిర్‌పోర్ట్‌లో కనిపించగానే పాపారాజ్జీలు కెమెరాలు క్లిక్‌మనేశారు.

ఇప్పుడు ఈ ప్రయాణానికి సంబంధించిన ఒక స్పెషల్ మూమెంట్‌ను శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ తమ సోషల్ మీడియా పేజీ ద్వారా షేర్ చేసింది. మహేష్ బాబుతో కలిసి ఎయిర్‌లైన్ సిబ్బంది దిగిన ఫోటోను పోస్టు చేస్తూ

“దక్షిణ భారత సినీ దిగ్గజం మహేష్ బాబును హైదరాబాద్ నుంచి కొలంబోకి తీసుకెళ్లే అవకాశాన్ని పొందినందుకు మేము గర్వంగా భావిస్తున్నాం. మా సిబ్బంది ఈ గౌరవనీయ అతిథిని ఆతిథ్యంతో ఆదరించడంలో ఎంతో ఆనందం పొందారు. మాతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు!” అని ముచ్చటగా రాశారు.

ఇక వర్క్‌ఫ్రంట్ విషయానికి వస్తే – మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ SSMB29 పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

, , ,
You may also like
Latest Posts from