
జపాన్ వీడియో గేమ్‌లో రాజమౌళి… డెత్ స్ట్రాండింగ్ 2లో క్యామియో రోల్
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు వీడియో గేమ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. జపాన్‌కు చెందిన ప్రముఖ గేమ్ డెవలపర్ హిడియో కొజిమా రూపొందిస్తున్న డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్ అనే గేమ్‌లో ఆయన తనయుడు ఎస్.ఎస్.కార్తికేయతో కలిసి చిన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ గేమ్‌కు సంబంధించిన డిజిటల్ డీలక్స్ మరియు కలెక్టర్ ఎడిషన్ యూజర్లకు ముందస్తు యాక్సెస్ లభించగా, అందులో ‘‘ది అడ్వెంచరర్’’ మరియు ‘‘అడ్వెంచరర్‌స్ సన్’’ అనే పాత్రలుగా రాజమౌళి, కార్తికేయ కనిపించినట్టు గేమింగ్ కమ్యూనిటీలో వార్తలు వస్తున్నాయి.
With director S.S. Rajamouli and his son and producer, S.S. Karthikeya. pic.twitter.com/e7DHKmJgsP
— HIDEO_KOJIMA (@HIDEO_KOJIMA_EN) April 30, 2025
2022లో RRR జపాన్‌లో విడుదలైన సమయంలో రాజమౌళి కొజిమాతో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి కొనసాగిన ఆ స్నేహం ఇప్పుడు ఈ గేమ్‌లో క్యామియో అవకాశంగా మారినట్టు తెలుస్తోంది.
హాలీవుడ్ నటులు నార్మన్ రీడస్, ఎల్లీ ఫానింగ్, లియా సెడాక్స్‌లతో పాటు ఈసారి భారతీయ ప్రతినిధులుగా రాజమౌళి – కార్తికేయ ఇద్దరూ ఇందులో ఉండడం విశేషం.
డెత్ స్ట్రాండింగ్ 2 గేమ్ జూన్ 26, 2025న ప్లే స్టేషన్ 5 కోసం విడుదల కానుంది.
