యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే మాస్.. కానీ ఇప్పుడు ఆయన కనిపిస్తున్న తీరు చూస్తే ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎప్పుడూ చబ్బీగా ఉండే తారక్, ఒక్కసారిగా ఇంత లీన్‌గా ఎలా మారిపోయాడు? ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ కోసం ఆయన చేసిన ఆ 10 కిలోల వెయిట్ లాస్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇది నేచురల్ ట్రాన్స్‌ఫార్మేషనేనా లేక ఆరోగ్యం ఏమైనా దెబ్బతిందా? ఈ బాడీ వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే షాక్ అవుతారు!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో మారిపోయాడు. రీసెంట్‌గా తారక్ లుక్ చూసిన ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు, సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే దీనిపై ఎన్టీఆర్ ట్రైనింగ్ టీమ్ అదిరిపోయే క్లారిటీ ఇచ్చింది. ప్రశాంత్ నీల్ కోరుకున్న లీన్ బాడీ కోసం తారక్ కేవలం ఏడు వారాల్లోనే సుమారు 10 కిలోల బరువు తగ్గాడని వెల్లడించింది.

ఈ మార్పు కోసం తారక్ రోజుకు 90 నిమిషాల పాటు కఠినమైన ‘ఫంక్షనల్ ట్రైనింగ్’ చేశాడని, చాలా రిస్ట్రిక్టెడ్ డైట్ తీసుకున్నాడని టీమ్ తెలిపింది. ముఖ్యంగా లో-ప్రోటీన్ డైట్ పాటిస్తూ, ఎక్కడా రాజీ పడకుండా ఈ స్థాయి డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కేవలం యంగ్ టైగర్‌కే సాధ్యమని వారు కొనియాడారు. ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ పూర్తిగా నేచురల్ అని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, రీసెంట్‌గా జోర్డాన్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ట్రైలర్ లేదా రిలీజ్ డేట్ గురించి ప్రకటన రాకముందే ఎన్టీఆర్ తన లుక్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. మరి ఈ లీన్ అండ్ పవర్ ఫుల్ అవతార్‌లో ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.

