ఈ వారం సినిమాప్రియుల కోసం తెరపై బీభత్సం జరగబోతోంది. స్టార్స్‌తో కూడిన మాస్ ఎంటర్టైనర్స్‌తో పాటు, క్రేజ్ పెరుగుతున్న యంగ్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బరిలోకి దిగుతున్నాయి. థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ మంచి కంటెంట్ వర్షం కురవబోతోంది. జూన్ 2 నుండి జూన్ 6 వరకు థియేటర్లు & స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ లో ఏం వస్తుందో చూద్దాం:
థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు:
🔹 థగ్ లైఫ్ (జూన్ 5)
కమల్ హాసన్ – మణిరత్నం కలయికలో వస్తున్న భారీ చిత్రం. శింబు, త్రిష, అభిరామి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగు & హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.
🔹 శ్రీశ్రీశ్రీ రాజావారు (జూన్ 6)
నార్నె నితిన్ హీరోగా, సంపద హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా 2022లో పూర్తి అయినా ఇప్పుడు మాత్రమే విడుదల అవుతోంది. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించారు.
🔹 హౌస్ ఫుల్ 5 (జూన్ 6)
బాలీవుడ్‌లో ఓ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా కాస్ట్ వింటేనే షాక్ అవుతారు: అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్, జాక్వెలిన్, నర్గీస్ ఫఖ్రీ, జాకీ ష్రాఫ్, సంజయ్ దత్, సోనమ్ బజ్వా… వానౌట్ కామెడీకి రెడీ అయిపోండి!
🔹 గ్యాంబ్లర్స్ (జూన్ 6)
‘మ్యాడ్’ ఫేం సంగీత్ శోభన్ నటించిన ఈ యూత్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను కొత్త తరహా గేమింగ్ థీమ్‌తో తెరకెక్కించారు.
🔹 బద్మాషులు (జూన్ 6)
మహేశ్ చింతల, విద్యాసాగర్ కాదంపురి ప్రధాన పాత్రల్లో, శంకర్ చేగూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమాగా విడుదలకానున్న ీ చిత్రం , కంటెంట్ పరంగా ఆశాజనకంగా కనిపిస్తోంది.
ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు & వెబ్ కంటెంట్:
Netflix:
జూన్ 4: One of Them Days (English – Thriller)
జూన్ 4: Job (Hindi – Crime Drama)
Jio Cinema:
జూన్ 2: టూరిస్ట్ ఫ్యామిలీ (Telugu, Tamil – Family Drama)
జూన్ 2: గజానా (Hindi – Action Thriller)
Disney+ Hotstar:
జూన్ 6: దేవికా & డాడీ (Telugu Series – Emotional Drama)