రీసెంట్ గా తమిళనాడులో సంచలన విజయం సాధించిన చిన్న సినిమా “టూరిస్ట్ ఫ్యామిలీ” – మన తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని కలిగిస్తూ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడీ చిత్రాన్ని డబ్ చేయటానికి నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ రైట్స్ కోసం పోటీ ఉన్నట్లు తమిళ ట్రేడ్ చెప్తోంది. ఆ డిటేల్స్ లోకి వెళితే…

సూర్య ‘రెట్రో’కి పోటీగా వచ్చి… సత్తా చాటిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’

తమిళనాట మెగాస్టార్ సూర్య హీరోగా వచ్చిన “రెట్రో” సినిమాతోనే ఒకేసారి థియేటర్లలో విడుదలైన టూరిస్ట్ ఫ్యామిలీ, అసలు ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే రిలీజ్ అయ్యింది. కానీ రిలీజైన వెంటనే వర్డ్ ఆఫ్ మౌత్ (WOM) తో ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఒక హ్యుమరస్, ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉండాలో అది చూపించి… ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తోంది.

3 రోజులలోనే ₹18.7 కోట్లు గ్రాస్ – చిన్న సినిమాకు ఘన విజయం!

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే…

తమిళనాడు: ₹12.2 Cr

ఇతర రాష్ట్రాలు (ROI): ₹2 Cr

ఓవర్సీస్: ₹4.5 Cr
మొత్తం కలిపి: ₹18.7 Cr గ్రాస్!

చిన్న బడ్జెట్ సినిమాకే కాదు, పెద్ద సినిమాలకే షాక్ ఇచ్చే రేంజ్ లో వసూళ్లు.

తెలుగులో భారీ డిమాండ్ – సోషల్ మీడియా జనం రిక్వెస్ట్!

ఈ సినిమా కథలో ఉండే ఎమోషన్, హ్యూమర్, ఫ్యామిలీ బాండింగ్ – ఇవన్నీ మన తెలుగు ఆడియెన్స్‌కు నచ్చే అంశాలే. అందుకే ఇప్పటికే సోషల్ మీడియాలో…

“టూరిస్ట్ ఫ్యామిలీ తెలుగులో ఎప్పుడు వస్తుంది?”
“దయచేసి డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయండి!”
“ఇది మిస్ అయితే మనమే నష్టంలో పడిపోతాం!”

అనేలా కామెంట్లు వర్షంలా పడుతున్నాయి.

ఇప్పుడు బాక్సాఫీస్‌లో ఖాళీ… ఇది గోల్డెన్ ఛాన్స్!

తెలుగు బాక్సాఫీస్‌లో ఈ మధ్య కొత్తగా పెద్ద సినిమాలు లేవు. వచ్చే మూడు వారాల వరకూ కూడా పెద్ద రిలీజ్లు లేవు. అలాంటి టైంలో మంచి WOM ఉన్న టూరిస్ట్ ఫ్యామిలీకి తెలుగులో విడుదలైతే ఒక సాలిడ్ విన్ అవుతుంది. డబ్బింగ్ తక్కువ టైమ్‌లో చేస్తే… అదే డిస్ట్రిబ్యూటర్స్ కు వేసవి కూల్ డ్రింక్ అవుతుంది!

, , ,
You may also like
Latest Posts from