టాలీవుడ్ జక్కన్న ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ సినిమా పేరు ‘వారణాసి’ (Varanasi) అని కన్ఫర్మ్ అయినప్పటి నుండి ఇంటర్నెట్‌లో సెర్చింగ్ పెరిగిపోయింది. ఏప్రిల్ 7, 2027 న వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ లాక్ చేసిన రాజమౌళి.. ఈసారి కేవలం ఒక సినిమాతో సరిపెట్టడం లేదు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న గ్లోబల్ లెవల్ కనెక్షన్స్, కథలోని ట్విస్టులు చూస్తుంటే గూగుల్ సర్వర్లు హ్యాంగ్ అవ్వాల్సిందే!
వారణాసిపై గ్రహశకలం దాడి? షాకింగ్ కథాంశం!
రీసెంట్‌గా విడుదలైన టీజర్ మరియు పోస్టర్ల ప్రకారం.. ఈ సినిమా కథ ఒక భారీ విపత్తు చుట్టూ తిరుగుతుంది. ‘శాంభవి’ అనే గ్రహశకలం (Asteroid) భూమిని ఢీకొట్టడం వల్ల కలిగే విలయం.. దానికి 512 CE కాలం నాటి పురాతన వారణాసికి ఉన్న సంబంధం ఏంటి? అన్నదే అసలు పాయింట్. ఇది ఒక టైమ్ ట్రావెల్ (Time Travel) ఎపిక్ అని సమాచారం. అందుకే ఫ్యాన్స్ ఈ సినిమాను #GlobeTrotter మరియు #TimeTrotter అని పిలుస్తున్నారు.
రాముడిగా మహేష్ బాబు.. ‘పూనకాలు’ తెప్పించే సీక్వెన్స్!
రాజమౌళి స్వయంగా వెల్లడించిన ప్రకారం.. ఈ సినిమాలో ఒక కీలకమైన ఘట్టం రామాయణం స్పూర్తితో సాగుతుంది.
మహేష్ బాబు ఇందులో రుద్ర అనే అడ్వెంచరర్ పాత్రతో పాటు, శ్రీరాముడి అవతారంలోనూ కనిపించబోతున్నారు.
దాదాపు 60 రోజుల పాటు షూట్ చేసిన ఈ ‘రామాయణ’ ఎపిసోడ్ రాజమౌళి కెరీర్ లోనే అత్యంత అద్బుతమైనదని చెప్తున్నారు. అలాగే మహేష్ బాబు తెల్లని నంది (White Bull) పై వారణాసి వీధుల్లో స్వారీ చేసే విజువల్స్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం!
గ్లోబల్ కాస్ట్ & రికార్డ్ బడ్జెట్!
దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంతర్జాతీయ నటీనటులు భాగమయ్యారు:
ప్రియాంక చోప్రా: ‘మందాకిని’ అనే నావిగేటర్ పాత్రలో గ్లోబల్ టచ్ ఇవ్వబోతోంది.
పృథ్వీరాజ్ సుకుమారన్: ‘కుంభ’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మహేష్‌తో తలపడనున్నారు.
రిలీజ్ డేట్ వెనుక జక్కన్న మాస్టర్ ప్లాన్!
ఏప్రిల్ 7, 2027 రిలీజ్ వెనుక రాజమౌళి పెద్ద లెక్కే వేశారు. ఉగాది, గుడి పడ్వా తో మొదలై.. అంబేద్కర్ జయంతి, శ్రీరామనవమి వరకు సెలవుల సీజన్‌ను పూర్తిగా వాడుకోవాలని ప్లాన్ చేశారు. ఇది 2027 లో వచ్చే ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాకు కూడా ఇబ్బంది లేకుండా ఒక నెల గ్యాప్‌తో ప్లాన్ చేయడం విశేషం.
‘బాహుబలి’ తో ఇండియన్ సినిమా స్టామినా చూపించిన రాజమౌళి.. ఇప్పుడు ‘వారణాసి’ తో హాలీవుడ్ రికార్డులపై కన్నేశారు. ఐమ్యాక్స్ స్క్రీన్లపై మహేష్ బాబు చేసే విన్యాసాలు చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.

