
టాలీవుడ్ లో ఓ షాక్ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. విశ్వసనీయమైన వర్గాల ప్రకారం, లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా గోప్యంగా నిశ్చితార్థం చేసుకున్నారట! ఈ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్‌లో ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారని టాక్.
బయట ప్రపంచానికి ఒక్క ఫొటో కూడా లీక్ కాకుండా డోర్‌లు క్లోజ్ చేసి జరిపేసిన ఈ సర్ప్రైజ్ ఈవెంట్ గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
విజయ్–రష్మిక రిలేషన్ గురించి గత కొంతకాలంగా రూమర్లు బాగా హీట్ అయ్యాయి. రెస్టారెంట్లలో, వెకేషన్‌లలో కలిసి స్పాట్ అవుతూ హింట్స్ ఇచ్చినా, పబ్లిక్‌గా మాత్రం ఎప్పుడూ అఫీషియల్‌గా ఏమీ చెప్పలేదు. కానీ ఈ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ వార్తతో అన్ని రూమర్స్‌కి క్లారిటీ వచ్చినట్టే!
విజయ్, పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో సంచలనం సృష్టించగా… రష్మిక పుష్పా ఫ్రాంచైజ్, ఆనిమల్తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇద్దరూ గీత గోవిందం, డియర్ కామ్రేడ్లో జంటగా మెరిసి, మళ్లీ త్వరలో స్క్రీన్ మీద రీయూనైట్ కానున్నారు.
అందరిలోనూ సస్పెన్స్ పెంచుతున్న ఇన్సైడర్ న్యూస్ ఏమంటుందంటే
ఫిబ్రవరి 2026లోనే పెళ్లి జరగబోతోందట.
మరి నిజంగా పెళ్లి బెల్స్ మోగబోతున్నాయా? లేక ఇది కూడా రూమర్ గేమ్ లో భాగమా?
అధికారిక ప్రకటన కోసం టాలీవుడ్ అంతా ఎదురు చూస్తోంది!
