దసరా సీజన్‌ను “కాంతార చాప్టర్ 1” ఘనంగా ముగించగా, వచ్చే మూడు నాలుగు నెలల్లో తెలుగు సినిమాల వరద రానుంది. అందులో “ఆంధ్ర కింగ్ తలూకా”, “మాస్ జాతర”, “డకాయిత్” వంటి రిలీజ్‌లు ఉన్నా… మొత్తం ఫోకస్ మాత్రం మూడు భారీ చిత్రాలపై ఉంది –

ప్రభాస్ “ది రాజాసాబ్”
బాలకృష్ణ “అఖండ 2: తాండవం”
మెగాస్టార్ చిరంజీవి “మన శంకర వరప్రసాద్ గారు”

ఈ మూడు ప్యాన్ ఇండియా లెవెల్ బిగ్ టికెట్ సినిమాలు ఇంకా OTT డీల్స్ ఫైనలైజ్ కాలేదట. సోషల్ మీడియాలో రికార్డు క్రేజ్ డీల్స్ క్లోజ్ అయ్యాయనే వార్తలు గాలిలో ఎగురుతున్నా… నిజానికి గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరే అని టాక్!

ఇప్పుడు OTT ప్లాట్‌ఫామ్‌లు కొత్త స్ట్రాటజీకి మారిపోయాయి.
ముందు లాగా స్టార్ హీరో సినిమాలకు అతి భారీ ఆఫర్స్ ఇవ్వడం మానేసి…
డీల్స్‌ను డిలే చేస్తున్నారు
రేట్లు గణనీయంగా తగ్గిస్తున్నారు
థియేట్రికల్ రన్‌కి టైడ్ కండీషన్లు పెడుతున్నారు

“అఖండ 2: తాండవం” డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ ఇచ్చినప్పటికీ, ప్రొడ్యూసర్ ఎక్కువ డిమాండ్ చేస్తుండటంతో డీల్ హ్యాంగ్‌లో ఉంది. అంతే కాదు, నెట్‌ఫ్లిక్స్ రెండు అదనపు షరతులు కూడా పెట్టిందని టాక్!

అదే సమయంలో ప్రభాస్ “ది రాజాసాబ్”, చిరంజీవి “మన శంకర వరప్రసాద్ గారు” కూడా OTT ప్లేయర్లతో నెగోషియేషన్స్‌లోనే ఉన్నాయట. రెండూ సంక్రాంతి 2026 రిలీజ్‌కు సిద్దమవుతున్నా, ఇప్పటివరకు ఏ ఒప్పందం కుదరలేదు.

అసలు ఈ సూపర్‌స్టార్ సినిమాలకు చివరికి ఎవరెవరు OTT భాగస్వాములు అవుతారన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్‌గా మారింది.

, , , , , , ,
You may also like
Latest Posts from