విజయ్ దేవరకొండ సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ పెరుగుతోంది. అదీ అతని చేతిలో ఉండటం లేదు. ఎంత ప్లాన్ చేసినా ఏదో ఒక అవాంతరం దెబ్బ కొడుతోంది. గతకొంత కాలంగా కమర్షియల్ హిట్స్ లేక, వరుస ఫ్లాపులతో కెరీర్ లో నిండా ఒత్తిడిలో ఉన్న దేవరకొండ అభిమానులు మాత్రం “కింగ్‌డమ్” మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాతో విజయ్ మళ్లీ ట్రాక్‌లోకి వస్తాడన్న నమ్మకంతో ఉన్నారు. అయితే… ఆ నమ్మకాన్నే వాయిదాలు నీరసపెట్టేస్తున్నాయ్!

ప్రారంభంలో 2025 మార్చి రిలీజ్ అనుకున్న “కింగ్‌డమ్”… వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. తర్వాత జూలై 4 తేదీని లాక్ చేసినట్లు టీమ్ ప్రకటించింది. కానీ ఇప్పుడు… అదే డేట్‌కి నితిన్ ‘తమ్ముడు’ రిలీజ్‌గా ఫిక్స్ కావడం, మరియు “కింగ్‌డమ్”లో ఇంకా పనులు పెండింగ్‌లో ఉండటంతో, ఈ సినిమా మళ్లీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

విజయ్ టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు… “కింగ్‌డమ్” మరోసారి వాయిదా అనేది ఖాయమైపోయినట్టే.

ఇది చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది – విజయ్ దేవరకొండ తన ప్రాజెక్టుల ప్లానింగ్‌లో ఎక్కడో ఇబ్బంది ఎదురౌతోంది. ఒక హిట్టు కోసం ఎదురుచూస్తున్న హీరోగా విజయ్ కి ఇప్పుడు సరైన టైమింగ్, పర్ఫెక్ట్ రిలీజ్ ప్లానింగ్ ఎంతో అవసరం. కానీ “కింగ్‌డమ్” వాయిదాల వల్ల సినిమా మీదున్న క్రేజ్ కూడా దెబ్బతింటోంది.

ఓవైపు మళ్లీ ట్రాక్‌లోకి రావాలని తెగపడి కష్టపడుతున్న హీరో… మరోవైపు గందరగోళ ప్రాజెక్ట్ ప్లానింగ్ వల్ల చతికిలపడ్డ సినిమాలు. ఈ నేపథ్యంలో ‘కింగ్‌డమ్’ విజయ్‌కు బ్రేక్ ఇస్తుందా? లేక… మరోసారి నిరాశ మిగిలిస్తుందా? అనేది ఎదురుచూసి తేల్చుకోవాల్సిన విషయం!

ఫ్యాన్స్ మాత్రం ఒక్క డేట్ కోసం ఎదురుచూస్తున్నారు – అది రిలీజ్ డేట్ కానీ, గుడ్ డేట్ !

, ,
You may also like
Latest Posts from